S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

08/23/2016 - 22:04

ఊపిరితిత్తుల్లోని గాలి గదులకు ఇనె్ఫక్షన్ రావడాన్ని న్యుమోనియా అంటారు. ఇలా వచ్చే ఇనె్ఫక్షన్స్ ఎదుర్కోవడంలో గాలి గదులు తెల్ల రక్త కణాల్తో చీముతో ఇతర ద్రావకాలతో నిండి, రక్తకణాల్లో ఆక్సిజన్ వెళ్లడం కష్టమవుతుంది. అక్కడినుంచి ఆ ఇనె్ఫక్షన్ శరీరమంతా క్రమంగా వ్యాపిస్తుంది.

08/23/2016 - 22:09

DTP:డిఫ్టీరియా, టెట్నస్, ఫెర్‌ట్యుసిస్ టీకా (దగ్గు, ధనుర్వాతం లాంటి వ్యాధులు రాకుండా)
OPV:నోటి ద్వారా పోలియో రాకుండా ఇచ్చే టీకా (పోలియో డ్రాప్స్)
MM:మీజిల్స్, మమ్స్ రాకుండా టీకా
M: ఇంజెక్షన్ ద్వారా మీజిల్ రాకుండా టీకా
CDT:చైల్డ్‌హుడ్ డిఫ్తీరియా, టెటనస్ ఇంజెక్షన్
R:రుబెల్లా వ్యాధి రాకుండా టీకా, ఇంజెక్షన్
ADT: అడల్డ్ డిఫ్తీరియా- టెట్నస్ టీకా, ఇంజెక్షన్

08/23/2016 - 22:06

కొన్ని మందులు వాడడంవల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతుంటాయి. అయినా ఎందుకు వాడవలసి వస్తుందంటే, అలా ఒదిలేస్తే అంతకన్నా పెద్ద ఉపద్రవం కలుగుతుందన్నప్పుడు... తప్పక అందుకే వైద్యులు నిర్దేశించిన మొత్తాలలో (ప్రొటీన్స్) చెప్పినన్ని రోజులే వేసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఏ మందులూ వేసుకోకూడదు. కొన్ని కొన్ని మందుల్ని కలిపి వేసుకుంటే రసాయనిక చర్యలు భిన్నంగా ఉండవచ్చు.

08/23/2016 - 21:52

‘డిస్టర్బ్‌డ్ డైజేషన్’ని ‘డిస్పేసియా’ అంటారు. అంటే ఆహారం సరిగా జీర్ణం కాకుండా ఉన్నవాళ్ళ జబ్బన్నమాట! దీనివల్ల అజీర్ణం, ఆమ్ల అజీర్ణం, జీర్ణాశయం అప్‌సెట్ కావడం, గుండెలో మంట వస్తాయి. ఈ అసౌకర్యం తీవ్రమైతే, ఎక్కువ కలుగుతుంటే వైద్యుడికి చూపించాలి. డిస్పేసియా గురించి అందరిలో అవగాహనుండాలి.

08/23/2016 - 21:50

* కార్డియక్ కేథటరైజేషన్ నొప్పితో కూడుకున్నదా?

08/23/2016 - 21:46

ప్ర: షుగర్ వ్యాధితో చాలాకాలం బాధపడ్తున్నాను. దాంపత్య సుఖం పూర్తిగా పోయింది. నివారణ చెప్పగలరు.
-కానూరి శ్రీవిశ్వనాథం, గుంటూరు
జ: షుగరు వ్యాధిలో మొదట తగిలే దెబ్బ వ్యక్తి శృంగార జీవితం మీదే! లైంగిక సుఖం కరువైతే కోట్ల ఆస్తులున్నా ఏం లాభం? జీవితంలోని మాధుర్యాన్ని దెబ్బతీసి, ఈ వ్యాధిని కనుగొన్న మొదటి రోజునుండే కఠినంగా అణచి ఉంచాలి.

08/16/2016 - 22:08

ఎక్కువ జన సమూహం వున్న కృష్ణా పుష్కర స్నానాలకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవచ్చును. జన సమూహాలలో దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండుటవలన కొందరికి ముక్కునుండి నీరు కారడం, ముక్కు బిగుసుకొనిపోయి శ్వాస ఆడకపోవడం, తుమ్ములు రావడం, దగ్గుతోపాటు ఆయాసం రావటం, ఛాతి బరువుగా అనిపించటం, కళ్లు ఎర్రబడి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, చర్మం పొడిగా మంటగా అనిపిస్తుంది.

08/16/2016 - 22:03

ప్రస్తుత కాలంలో చాలామంది మడమ నొప్పితో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి విధానంవల్ల సరైన పోషక ఆహారం తీసుకోక ఊబకాయం తోడై మడమ నొప్పిని అతి చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు. నిత్య జీవితంలో ప్రతి కదలిక మడిమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడిమనొప్పితో కదలికలు కష్టంగా మారుతుంది.
మడమ నొప్పికి కారణాలు

08/16/2016 - 22:00

ప్రధానంగా ఇవి రెండు రకాలు. మొదటిది నాన్‌నార్కొటిక్ డ్రగ్స్. మందుల షాపులల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని కొనుక్కోవచ్చు. ఉదాహరణకి యాస్పిరిన్, పేరాసిట్‌మల్, బ్రూఫిన్, ఫెల్డిన్ లాంటివి. ఇవన్నీ మైల్డ్ పెయిన్ కిల్లర్స్. జ్వరం, తలనొప్పి, కండర నొప్పులు, కీళ్ళనొప్పులకు వీటిని తీసుకొంటుంటారు.

08/16/2016 - 22:00

ముక్కు ద్వారా మనం శ్వాసించే గాలి, శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తులలోకి వెళ్లి అప్పుడు ఆ గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి వెళ్తూన్నప్పుడే రక్తంలోని కార్బన్‌డయాక్సైడ్ ఊపిరితిత్తులలోకి వచ్చి శ్వాసనాళం ద్వారా ముక్కులోంచి నిశ్వాస ద్వారా బయటకు వచ్చేస్తుంది.
అలాగే ముక్కు గాలి ద్వారా వస్తున్న వాసనలని పసిగడుతుంటుంది. అందుకు తగ్గట్టు ముక్కు నిర్మాణముంటుంది.

Pages