S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిషన్ కాకతీయతో పెరిగిన భూగర్భజలం

సంగారెడ్డి, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ చెరవుల మరమ్మతుల పుణ్యమాని ఊహించని స్థాయిలో భూగర్భంలో నీటి నిల్వలను పెంచుకోగలిగామని, ఇటీవల కురిసిన వర్షాలతో 450 టిఎంసిల నీటిని భూగర్భంలో నిల్వ చేసుకున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పురావస్తు శాఖ తవ్వకాలు నిర్వహిస్తే అందులో లభించే వివిధ వస్తువుల మాదిరిగా మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల మరమ్మతులు అంతే విజయాలను సాధించి పెట్టాయన్నారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని నీటి మట్టం పడిపోయిందని, పుష్కలంగా వర్షాలు కురియడంతో చెరువులు, కుంటలు నిండిపోవడంతో భూగర్భ జలమట్టం ఒక్కసారిగా 11 మీటర్ల ఎత్తుకు పెరిగిందంటే నమ్మశక్యం కాని అంశమన్నారు. కష్టపడి, కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి జలాశయాల్లో నింపుకున్న నీటిని వృదాపోనీయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులకు 25 వేల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేయిస్తున్నట్లు వివరించారు. పంట కాలువల ద్వారా వెళ్లే నీటిని కూడా నిర్లక్ష్యం వాడుకోవద్దని విజ్ఞప్తి చేసారు.