S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శవ వాహనాలు ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 18: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించినవారి మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వం ఉచిత వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వాహనాలను నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావుజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు తమ కుటుంబ సభ్యులు చనిపోయినపుడు వారి మృతదేహాలను స్వస్థలాలకు, ఇళ్లకు తరలించేందుకు ఎంతో వెచ్చిస్తున్నారని, మరికొన్ని సందర్భాల్లో నిరుపేద కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటం విచారకరమని అన్నారు. కొన్నిసార్లు డబ్బుల్లేక మృతదేహాలను భుజాలపై మోసుకువెళ్లిన ఘటనలు పలు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్న సందర్భాలను గుర్తుచేశారు. ఈ రకమైన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకోరాదన్న మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ వాహనాలను ముందు జాగ్రత్తగా అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. తొలి విడతగా రాష్టవ్య్రాప్తంగా 50 వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. వీటిలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు పది వాహనాలు చొప్పున, నిమ్స్ ఆసుపత్రికి 2, మిగిలిన వాహనాలను ఇతర జిల్లాలకు కేటాయించామన్నారు. ఎంతో గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన ఈ వాహన సేవలను ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే 102 వాహనాల ద్వారా అమ్మఒడి సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. వీటి ద్వారా గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రికి ఉచితంగా వెళ్లే సౌకర్యం అందుబాటులోకి రావటంతో పాటు ప్రసవం అనంతరం తిరిగి ఇంటికి సురక్షితంగా చేర్చనున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యానికి గల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రెండు రంగాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ వాహనాల ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా ఉచితంగా మృతదేహాన్ని తీసుకువెళ్లవచ్చునని, ఎవరికీ నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమలత, సరస్వతి, వైద్యారోగ్యశాఖ ఇంఛార్జి ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమణి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డా.లలితకుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జివిరెడ్డి, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మంజూల, ఆర్‌ఎంవో శేషాద్రినాయుడు, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. గాంధీ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం శవ వాహనాలను ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ,
మంత్రులు లక్ష్మారెడ్డి, పద్మారావు, తలసాని