S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నోట్ల రద్దు తొలి అడుగే

విశాఖపట్నం, నవంబర్ 18: నల్లధనం వెలికితీతలో రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం తొలి అడుగు మాత్రమేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనం వెలికితీసే క్రమంలో భవిష్యత్‌లో మోదీ తీసుకునే నిర్ణయాలు దేశ గతినే మార్చేస్తాయన్నారు. దీనిని రాజకీయాలు, వ్యవస్థలను మార్చే కీలక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. దేశంలో 16.5 లక్షల కోట్ల విలువ నోట్లు చెలామణిలో ఉన్నాయని, వీటిలో పెద్ద నోట్లుగా పేర్కొంటున్న రూ.500, రూ.1000 నోట్ల మొత్తం 14.5 లక్షల కోట్లన్నారు. మొత్తం కరెన్సీలో ఇది 86 శాతంగా ఉందన్నారు. దేశంలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన ప్రధాని మోదీ నల్లధనం వెలికితీయాలన్న దృఢ సంకల్పంతో రద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో దేశ ప్రజలు ఏకమై ఇచ్చిన తీర్పే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే మోదీ నల్లధనంపై యుద్ధం మొదలు పెట్టారన్నారు. ఈ యుద్ధంలో నోట్ల రద్దు తొలి అడుగు మాత్రమేనని, ప్రధాని మోదీ మున్ముందు మరిన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. నోట్ల రద్దును దేశ ప్రజలు ఆమోదిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, వామపక్ష పార్టీలు రాద్ధాంతం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. నోట్ల రద్దు ప్రకటనలోనే మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారని, 50 రోజులు తనకు సహకరిస్తే, ఈ దేశానికి బంగారు భవిష్యత్‌ను అందిస్తానన్నారని గుర్తు చేశారు. ఇక విదేశీ బ్యాంకుల్లో దాచిన న్లలధనం వెలికితీసే అంశంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే విదేశాల్లోని నల్లధనంపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక కారణాల వల్ల విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి రప్పించే ప్రక్రియ కాస్త ఆలస్యమైనా ఆచరణలోకి వస్తుందన్నారు.