S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 04:54

తోట్లవల్లూరు, నవంబర్ 18: మండలంలోని వల్లూరుపాలెం లంకలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని గురవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతి ఆక్రమించారు. జిల్లా సిపిఎం కార్యదర్శి ఆర్ రఘు, పామర్రు డివిజన్ సిపిఎం కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు, మండల సిఐటియు కార్యదర్శి వి స్వరూపరాణి ఆధ్వర్యంలో సుమారు 50 మంది పేదలు భూములను ఆక్రమించారు.

11/18/2016 - 04:53

అవనిగడ్డ, నవంబర్ 17: దివిసీమ ప్రాంతంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు నాలుగు సెంటీ మీటర్ల వర్షపాతం కురవటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత నెలా 15 రోజులుగా వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో కురిసిన వర్షం రైతులకు ఊరట కలిగింది.

11/18/2016 - 04:52

ముదినేపల్లి, నవంబర్ 17: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని, అలాగే గ్రామాల్లో వౌళిక వసతులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు, స్వచ్ఛ్భారత్, స్వచ్ఛాంద్ర ప్రదేశ్‌లో భాగంగా ప్రజలను చైతన్యపరచేందుకే జనచైతన్య యాత్రలని ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు అన్నారు. ముదినేపల్లి మండలం ఊటుకూరు, వి రావిగుంట, వాడవల్లి గ్రామాల్లో గురువారం జన చైతన్య యాత్రలు జరిగాయి.

11/18/2016 - 04:52

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: విజయవాడ నగరంలో త్వరలో అమలుకానున్న 279 జీవో నేపథ్యంలో నగర పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుకు వర్క్‌బేస్డ్ పనివిధానాన్ని ప్రవేశపెట్టేందుకున్న సాధ్యాసాధ్యాలపై విఎంసి కమిషనర్ వీరపాండియన్ సమీక్షించారు.

11/18/2016 - 04:51

విజయవాడ, నవంబర్ 17: ప్రపంచ బ్యాంక్ సహకారంతో పేద ప్రజానీకానికి లబ్ధిచేకూరేలా అటల్ పింఛన్ యోజన (ఎపివై) కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి రాబోతోంది. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రపంచ బ్యాంక్ సీనియర్ కన్సల్టెంట్ పారుల్ సేథ్ ఖన్నా, గౌతమ్ భరద్వాజలతో ఎపివై పథకం అమలుపై కలెక్టర్ బాబు.ఎ సమావేశం నిర్వహించారు.

11/18/2016 - 04:50

విజయవాడ, నవంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు చేరవేయడంలో ప్రజాప్రతినిధులు తమవంతు కర్తవ్యం నెరవేర్చాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. గురువారం జలవనరుల శాఖ కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, జన్మభూమి కమిటీలు, నీటి సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

11/18/2016 - 04:50

విజయవాడ, నవంబర్ 17: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1100 మంది బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.

11/18/2016 - 04:49

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 17: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, వెస్టిండీస్ మహిళ జట్ల మధ్య శుక్రవారం నుండి టి-20 సమరం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు మ్యాచ్ ఫలితం కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన క్రికెట్ ప్రేమికులకు పొట్టి ఫార్మాట్‌తో పండగ వాతావరణం ఏర్పడింది.

11/18/2016 - 04:47

హైదరాబాద్, నవంబర్ 17: జెఎన్‌టియు గత ఏడాది నుండి అమలుచేస్తున్న డిటెన్షన్ దెబ్బకు ఫస్టియర్ విద్యార్ధులు గింగిర్లు తిరిగారు. చాలా సంవత్సరాలుగా డిటెన్షన్ విధానం సెకండియర్, థర్టు ఇయర్, ఫోర్తు ఇయర్ విద్యార్ధులకు మాత్రమే అమలులో ఉండగా, ఫస్టియర్ విద్యార్థులకు అమలుచేయడం లేదు. అయితే గత ఏడాది నుండి జెఎన్‌టియు ఫస్టియర్ విద్యార్ధులకు సైతం డిటెన్షన్ అమలుచేస్తోంది.

11/18/2016 - 04:47

ధారూర్, నవంబర్ 17: వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడిగా కులకచర్ల మండలానికి చెందిన కరణం ప్రహ్లాదరావు ఎన్నికయ్యారు. గురువారం స్థానిక నాగేశ్‌గుప్త గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో కరణంను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

Pages