S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 04:46

జీడిమెట్ల, నవంబర్ 17: రైతులకు లాభాలు చేకూర్చేందుకే సెంట్రో ఎక్స్‌లెన్సీలను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జీడిమెట్ల పైపులైన్ రోడ్డులోని సెంట్రో ఎక్స్‌లెన్సీ సెంటర్‌ను తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్‌రెడ్డితో కలిసి మంత్రి సందర్శించి అందులోని మొక్కలను పరిశీలించారు.

11/18/2016 - 04:46

ఖైరతాబాద్, నవంబర్ 17: నల్లధనాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఏ మేరకు సత్పలితాలను ఇస్తుందో తెలియదు కానీ పేద, సామాన్య ప్రజలు నానా ఇక్కట్లకు గురిచేస్తుంది. ఈనెల 8న ప్రదాని నరేంద్ర మోదీ ఎనిమిది గంటల సమయంలో రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

11/18/2016 - 04:44

హైదరాబాద్, నవంబర్ 17: మహానగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా నగరంలోని 45 వార్డులను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత వార్డులుగా జిహెచ్‌ఎంసి ప్రకటించింది. మరో 112 వార్డులను కూడా డిసెంబర్ చివరి కల్లా ప్రకటించటానికి జిహెచ్‌ఎంసి సన్నద్దమవుతోంది. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు విద్యార్ధినీ, విద్యార్ధులను భాగస్వామ్యం చేస్తున్నారు.

11/18/2016 - 04:44

హైదరాబాద్, నవంబర్ 17: శివారు మున్సిపల్ సర్కిల్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు రూ.1900 హడ్కో రుణంతో అభివృద్ధి పనులు చేపడుతొంది జలమండలి. ఈ పనులను వివిధ ప్యాకేజీల కింద విభజించి పనులు చేపడుతోంది. శివార్లలోని 12 మున్సిపాల్టీలను గ్రేటర్ వీలినం చేసిన ప్రభుత్వం తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగు పర్చేందుకు జలమండలి ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో పనులు చేపడుతోంది.

11/18/2016 - 04:43

సికిందరాబాద్, నవంబర్ 17: అనాలోచిత నిర్ణయాలు అధికారుల మధ్య సమన్వయలోపం వెరసి తెలంగాణ పాడి పరిశ్రమను మరోసారి నష్టాల ఊబిలోకి దించుతుంది. సిఎం కెసిఆర్ ఎంతో ముందు చూపుతో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో రైతులకు రూ.4 ప్రోత్సాహకాన్ని అందించడంతోపాటు పాడి అభివృద్ధికి పాల సేకరణకు ప్రైవేటు డెయిరీలను తట్టుకోవడానికి ధీటుగా రైతులకు సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రోత్సహిస్తున్నారు.

11/18/2016 - 04:40

మేడ్చల్, నవంబర్ 17: మేడ్చల్ పట్టణంలోని రథంశాల సమీపంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులకు (బాలికలు) మాయమాటలు చెప్పి బంగారు చెవి పోగులు వెండి పట్టీలతో ఉడాయించిన మాయలేడి ఉదంతమిది.

11/18/2016 - 04:40

ముషీరాబాద్, నవంబర్ 17: గత సంవత్సర ఫీజు బకాయిలు రూ.1800 కోట్లు తక్షణమే చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్‌షిప్‌లు పెంచాలని బిసి విద్యార్ధి సంఘం డిమాండ్ చేసింది. సంఘం పిలుపు మేరకు గురువారం నగరంలోని వివిధ కాలేజీల నుండి వేలాది మంది విద్యార్ధులు ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు.

11/18/2016 - 04:39

ఖైరతాబాద్, నవంబర్ 17: బెదిరించి చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠా సభ్యులను సంజీవరెడ్డినగర్ (ఎస్‌ఆర్‌నగర్) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం పంజాగుట్ట ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసిపి వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. యూసఫ్‌గూడ జవహర్‌నగర్‌కు చెందని ఎస్.కే.

11/18/2016 - 04:38

జీడిమెట్ల, నవంబర్ 17: పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల కలకలం కేసులో ఓ నిందితుడిని అరెస్టు చేసి మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్ తెలిపారు. గురువారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి, ఎసిపి అశోక్‌కుమార్, సిఐ డివి రంగారెడ్డితో కలిసి కాల్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

11/18/2016 - 04:37

కాచిగూడ, నవంబర్ 17: అడిగితే ఇచ్చేవాడు భగవంతుడు కాదని, అవసరం తెలుసుకుని ఇచ్చేవాడు భగవంతుడని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. భక్తిటివి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి గురువారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పవన్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి భగవంతుడంటే ఎంతో భయమని తెలిపారు. తనకు ఆధ్యాత్మిక ప్రసంగం చేయడం రాదని అన్నారు.

Pages