S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నగదు రహిత లావాదేవీలకు 10వేల పోస్ మిషన్లు

విజయవాడ, నవంబర్ 17: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1100 మంది బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000ల నోట్లు రద్దుచేసిన నేపథ్యంలో రోజువారీ నగదు రహిత లావాదేవీలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ జిల్లాలో సామాన్య ప్రజానీకానికి నగదు బదిలీలో ఇబ్బందులు లేకుండా తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాలో 26వేల రిజిస్టరైన వాణిజ్య సంస్థలు వున్నాయని, వీటిలో 7000 మందికి పోస్ మిషన్లు వున్నాయన్నారు. వీటిలో 5000 మిషన్లు వినియోగంలో వున్నాయన్నారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించటానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో వాణిజ్య బ్యాంకులు 10వేల పోస్ యంత్రాలు సరఫరా చేయటానికి బ్యాంకులు ముందుకొచ్చాయని, ఇవి నియోగంలోనికి వస్తే వినియోగదారులకు నగదు బదిలీలు సులభతరం అవుతుందని జిల్లా కలెక్టర్ చంద్రబాబుకు వివరించారు.