S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వల్లూరుపాలెం లంకలో భూముల ఆక్రమణ

తోట్లవల్లూరు, నవంబర్ 18: మండలంలోని వల్లూరుపాలెం లంకలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని గురవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతి ఆక్రమించారు. జిల్లా సిపిఎం కార్యదర్శి ఆర్ రఘు, పామర్రు డివిజన్ సిపిఎం కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు, మండల సిఐటియు కార్యదర్శి వి స్వరూపరాణి ఆధ్వర్యంలో సుమారు 50 మంది పేదలు భూములను ఆక్రమించారు. ఎర్రజెండాలు చేతపట్టి లంకలోకి ప్రవేశించి ప్రభుత్వ భూమిలో జెండాలు పాతారు. ఈ భూముల్లో దట్టంగా పెరిగిన ముళ్ళచెట్లు, పొదలను నాయకులు, పేదలు కలిసి నరికి బాగుచేశారు. అవసరమైతే జేసీబీ తీసుకువచ్చి భూములను సాగుకి అనుకూలంగా బాగుచేయిస్తామని జిల్లా సిపిఎం కార్యదర్శి రఘు చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, రెండోదఫా ధర్నా చేశామని, అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవటంతో తామే భూముల్లోకి ప్రవేశించాల్సి వచ్చిందని రఘు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూముల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మిగిలిన చోట్ల భూముల్లోకి ప్రవేశిస్తామని పేర్కొన్నారు.

వివాహిత అనుమానాస్పద మృతి
జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 17: కుటుంబ కలహాల నేపథ్యం వివాహిత (25) ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మధ్యాహ్నం మండలంలోని తొర్రగుంటపాలెం గ్రామంలో జరిగింది. తొర్రగుంటపాలెంకు చెందిన మీసాల అశ్వత్దామతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సీతంపేటకు చెందిన వరలక్ష్మికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అశ్వద్ధామ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. బుధవారం వరలక్ష్మి తల్లి, చెల్లి తొర్రగుంటపాలెం వచ్చారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో వరలక్ష్మి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వచ్చి చూసే సరికే పూర్తిగా కాలిపోయింది. ఇంటిలోని కొన్ని సామానులు కూడా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకొని ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు. అనంతరం చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.