S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దివిసీమలో భారీ వర్షం

అవనిగడ్డ, నవంబర్ 17: దివిసీమ ప్రాంతంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు నాలుగు సెంటీ మీటర్ల వర్షపాతం కురవటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత నెలా 15 రోజులుగా వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో కురిసిన వర్షం రైతులకు ఊరట కలిగింది. కాలువ చివరి భూములకు కూడా నీరు లేక ఇటీవల వేసిన నారుమళ్ళు ప్రాణం పోసుకుంటున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిలో నిలిచిన వర్షపునీటితో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

బంటుమిల్లిలో జ్యుయలరీ షాపులో చోరీ
బంటుమిల్లి, నవంబర్ 17: స్థానిక లక్ష్మీపురం సెంటరులోని ఓ జ్యుయలరీ షాపులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. వెంకట రమణ జ్యుయలరీ షాపు యజమాని పులి సురేష్ ఎప్పటిలాగానే బుధవారం రాత్రి దుకాణాన్ని కట్టి వెళ్ళిపోయారు. గురువారం ఉదయం ఆ దుకాణం పరిసరాల్లో పూల వ్యాపారం చేసుకునే వారు దుకాణం తలుపులు తీసి ఉండటాన్ని చూసి యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన దుకాణానికి వచ్చిన సురేష్ 20 గ్రాముల బంగారు అభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నవీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
గన్నవరం, నవంబర్ 17: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరంపల్లి శివారు రామచంద్రపురంలో గురువారం వెలుగులోకి వచ్చింది. సూరంపల్లి గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యుడు కాటూరి రవి (26) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. గడచిన నాలుగు రోజుల నుండి మనోవేదనకు గురై బుధవారం రాత్రి ఇంటి దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరం సిఐ అహ్మద్ ఆలీ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.