S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నగదుతో పనేంటి?

విశాఖపట్నం, నవంబర్ 17: నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, దీనికోసం ప్రతి ఒక్కరూ జన్‌ధన్ ఖాతాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కరెన్సీ ప్రమేయం లేకుండా ఆర్థిక కార్యకలాపాలు జరిగితే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. బ్యాంకుల్లో ఖాతాలతో రూపీ కార్డ్ తీసుకుంటే కొనుగోళ్లకు నగదు ప్రమేయం ఉండదన్నారు. చిల్లర దుకాణాల్లో సైతం రూపీకార్డ్ చెల్లుబాటయ్యే విధంగా ఈపాస్ మాదిరి యంత్రాలు అమరుస్తామని ప్రకటించారు. ఇప్పటికే కొన్ని యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే మరిన్ని తీసుకువస్తామని, చిల్లర వర్తకులు, వ్యాపారులు కూడా వీటిని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. సెల్ ఫోన్‌లతోనే కొనుగోళ్లు, విక్రయాలు జరిగిపోతున్నాయని, అన్నీ మీకు నేర్పిస్తామని, ఇక మీరు మొబైల్ కరెన్సీ వినియోగానికి సిద్ధ పడాలని కోరారు. దీనికి విశాఖ నాంది కావాలని అన్నారు.
రూ.2000 నోటుతో నల్లధనం పెరుగుతుంది
కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు, కొత్తగా చెలామణిలోకి తీసుకువచ్చిన రూ.2000 నోటు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద నోటు వల్ల నల్లధనం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజానీకం కొన్ని ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే రూ.500 నోట్లతో పాటు రూ.100, రూ.50 నోట్లు చెలామణిలోకి వస్తే పరిస్థితులు కొంతమేర అదుపులోకి వస్తాయని అన్నారు.