S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉచితంగా మృతదేహాల తరలింపు

హైదరాబాద్, నవంబర్ 17: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించిన వారి మృత దేహాన్ని వారి ఇళ్ల వరకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హర్సే పేరుతో పరమ పద వాహనాలను ఏర్పాటు చేస్తోంది. ఈ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో ప్రారంభిస్తారు. భార్య శవాన్ని వాహనంలో ఇంటికి తీసుకు వెళ్లలేక ఒరిస్సాలో 60 కిలోమీటర్ల వరకు భుజాన మోస్తూ వెళ్లిన సంఘటనలు జరగడంతో ప్రభుత్వం తెలంగాణలో పేదలు ఇబ్బంది పడకుండా ఈ వాహనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత 50 వాహనాలను అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ వైద్యశాలల్లో ఇవి అందుబాటులో ఉంటాయ. గాంధీ ఆస్పత్రిలో 10, ఉస్మానియాలో 10, నిమ్స్‌లో రెండు, ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ఆరు, పాలమూరుకు రెండు, వరంగల్ ఎంజిఎంకు మూడు, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు రెండు, భద్రాచలంకు ఒకటి, నిజామాబాద్ రెండు, మంచిర్యాలకు ఒకటి, గజ్వేల్‌కు ఒక్క వాహనాన్ని కేటాయించారు. మరో పది వాహనాలు వెసులుబాటును బట్టి అందుబాటులో ఉంటాయి. ‘108’ వాహనాలతో పాటు ఈ వాహనాల నిర్వహణ బాధ్యతను కూడా జివికె గ్రూప్ చేపట్టనుంది.

చిత్రం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారిని ఉచితంగా తరలించేందుకు సిద్ధమైన వాహనం