S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 20:53

గురుసాయిబాబా ఇంటర్నేషనల్ పతాకంపై మిలింద్ గునాజీ సాయిబాబాగా నటించిన చిత్రం ‘బ్రహ్మాండ నాయక్ సాయిబాబా’. సత్యప్రకాష్ దూబె దర్శకత్వంలో నార్సింగ్ ఎం.షిండే, సత్యప్రకాష్ దూబె తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.

09/25/2016 - 16:58

కోజికోడ్:కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లోనే ఉంటుందని, తమనుండి ఆ ప్రాంతాన్ని ఎవరూ విడదీయలేరని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. కాశ్మీర్‌పై ఎవరు కలలుగన్నా అవి కల్లలే అవుతాయన్నారు. ఉరీ సంఘటనకు పాల్పడిన ఉగ్రవాదుల మూకను పెంచి పోషించినది పాకిస్తానేనని సూటిగా విమర్శించారు. ఉరీ సంఘటనకు బాధ్యులైన వారికి బుద్ధి చెప్పాల్సిందేనని అన్నారు. ఈ మేరకు బిజెపి తీర్మానం ఆమోదించింది.

09/25/2016 - 16:57

న్యూఢిల్లి:కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను దేశం మరచిపోదని, దాడులకు పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం మన్‌కీబాత్‌లో భాగంగా రేడియోలో ఆయన ఉరీ సంఘటనపై మాట్లాడారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నవారిపై సైన్యం తగిన సమయంలో జవాబు చెబుతుందని, సత్తా చాటుతుందని, మన సైన్యం తెగువపై అందరూ నమ్మకముంచాలని ఆయన పిలుపునిచ్చారు.

09/25/2016 - 16:57

కరీంనగర్:జిల్లాలోని జలకళతో ఉట్టిపడుతున్న మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట కోతకు గురవడంతో అందరూ భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. రుద్రవరం, కుదురుపాక, కందికట్కూరు ప్రాంతాలకు ముప్పు ఏర్పడటంతో అధికారులు వెంటనే స్పందించి కట్ట కోతకు గురవుతున్న చోట ఇసుకబస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు.

09/25/2016 - 16:56

గుంటూరు:పల్నాడులో వర్షాలు, వరదలకు నష్టపోయిన అందరినీ తక్షణం ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఆదివారం ఉదయం పల్నాడులోని గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, మాచర్ల, దాచేపల్లి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఏరియల్ సర్వేలో వరద తీవ్రతను పరిశీలించారు. దాచేపల్లిలో బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను, అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు.

09/25/2016 - 16:55

ఇస్లామాబాద్:కాశ్మీర్‌లోని ఉరీలో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడులతో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఎటువంటి విచారణ లేకుండా, ఆధారాలు చూపకుండా పాకిస్తాన్‌పై భారత్ నిందలు మోపుతోందని, దుష్ప్రచారం చేస్తోందని ఆ దేశ విదేశీవ్యవహారాల సలహాదారు సర్తార్ అజీజ్ ఆరోపించారు. భారత్‌కు ఇది అలవాటుగా మారిందని అన్నారు.

09/25/2016 - 16:55

న్యూఢిల్లి:పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముషలాబాద్‌కు సమీపంలో ఓ బస్సు నీలం నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24మంది దుర్మరణం పాలయ్యారు.

09/25/2016 - 16:54

న్యూఢిల్లి:హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను 79 రోజుల అనంతరం పూర్తిగా ఎత్తివేశారు. అయితే గుంపులుగా ఎవరూ తిరగకుండా ఉండేందుకు, పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. రెండు రోజులుగా ప్రశాంత పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

09/25/2016 - 16:54

హైదరాబాద్:సోమవారం తలపెట్టిన తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేశారు. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురియనుండటం, ఇంకా వర్షాల కష్టాలనుంచి ప్రజలు తేరుకోకపోవడం, జిల్లాల్లో మంత్రులు సహాయక చర్యలపై దృష్టి సారించడం వల్ల ఈ భేటీని రద్దు చేసినట్లు తెలిసింది.

09/25/2016 - 16:53

హైదరాబాద్:అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారంనాడు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారంనుంచి కోస్తాంధ్రలో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

Pages