S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోలేరా?

చోడవరం, సెప్టెంబర్ 24: జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం మండలంలోని వివిధ పాఠశాలలను, గవరవరం పిహెచ్‌సిని సందర్సించారు. వైద్య, ఉపాధ్యాయ సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తంచేశారు. ప్రధానంగా వెంకన్నపాలెం, గవరవరం ప్రాథమిక పాఠశాలల్లో లోపించిన పారిశుద్ధ్యంపై ఆయన సంబంధిత ఉపాధ్యాయ సిబ్బందిని నిలదీశారు. ప్రస్తుతం వర్షాల సీజన్ కావడంతో జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్నప్పటికీ పాఠశాలలకు సమీపంలోనే చెత్తాచెదారాలు పేరుకుపోవడం,పాఠశాలల్లో తుప్పలను తొలగించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీనెలా నాల్గవ శనివారం స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని, అవగాహనా ర్యాలీలు చేపట్టాలని తదితర కార్యక్రమాలను నిర్వహించాలని సూచించినప్పటికీ ఉపాధ్యాయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తగిన విధంగా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. తాను నోటీసులు అందజేసేది లేదని తగిన విధం గా స్పందించి పనితీరు మార్చుకోకుంటే తగు చర్యలు తీసుకుని తీరుతానని హెచ్చరించారు. గవరవరం ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం రమణమ్మ పాఠశాలలో పిచ్చిమొక్కలు పెద్దఎత్తున ఉన్నప్పటికీ తొలగించకపోవడంతోపాటు పాఠశాలకు దగ్గర్లోనే చెత్తాచెదారాలను పారవేయడంపై రమణమ్మను ప్రశ్నించారు. ఈ విషయా న్ని జిల్లావిద్యాశాఖాధికారికి తెలియజేస్తామన్నారు. అలాగే వెంకన్నపాలెం ప్రాథమిక పాఠశాల రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించాలని, నాచుపేరుకుపోవడం వలన విద్యార్థులకు అంటురోగాలు ప్రబలుతాయని ఆయన అన్నా రు. అలాగే శిథిలావస్థకు చేరుకున్న చోడవరం-గవరవరం రోడ్డుపై కూడా ఆయన స్పందించారు. సంబంధిత అధికారులతో శనివారం సాయంత్రం సమీ క్ష జరిపి ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ పి.రామారావు, ఇవోఆర్‌డి ఆంజనేయులు, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ నర్సింహారావు, నీటిపారుదల శాఖ డిఇ మాదవి, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.