S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎన్నికలకు సిద్ధం

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)కు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమేనని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశమైన సమన్వయ కమిటీ ఎమ్మెల్యేలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా నగర అభివృద్ధికి పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపారు. వుడా సెంట్రల్ పార్క్‌లో ప్రజలకు నెల రోజుల పాటు ఉచితంగా ప్రవేశం కల్పించాలని నిర్ణయించామన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న గాజువాక, ఎన్‌ఎడి, మద్దిలపాలెం ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించాలని, ఘోషా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. జివిఎంసికి వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఎన్నికల తేదీలు ప్రకటించేలోగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. విశాఖలో మత్స్యకార వర్గాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే రూ.40కోట్లతో అభివృద్ధి పనులకు డిపిఆర్ సిద్ధం చేసినట్టు తెలిపారు. సమావేశంలో అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాస్, పీలా గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
జన్మభూమి, సభ్యత్వంపై చర్చ!
తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో అక్టోబర్ నుంచి జరగనున్న జన్మభూమి కార్యక్రమం, నవంబర్ నుంచి మొదలు కానున్న సభ్యత్వ నమోదుపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. గత జన్మభూమి హామీలు, వినతుల పరిష్కారంపై ఇప్పటి నుంచి అధికారుల నుంచి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. వినతులు పరిష్కరించే విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు.