S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 05:46

వలిగొండ, సెప్టెంబర్ 24: మూసీ ఎగువ ప్రాంతమైన హైద్రాబాద్‌లో కురుస్తున్న అతిభారీ వర్షంతో మూసీ క్రమక్రమంగా ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని సంగెం కాజ్‌వేపై నుండి ప్రవహిస్తున్న మూసీ భీమలింగం కత్వ, ఆసిఫ్‌నహార్ కత్వ పైనుండి హోరెత్తుతు ప్రవహిస్తుంది. మూసీ ప్రవాహాంతో, గురువారం నుండి కురిసిన వర్షంతో మండలంలోని అన్ని చెరువులు మత్తడి దూకుతూ కనిపిస్తున్నాయి.

09/25/2016 - 05:45

పాపన్నపేట, సెప్టెంబర్ 24: మంజీర ఉధ్ధృతంగా పొంగిపొర్లడంతో పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గ్భావాని పుణ్యక్షేత్రం వద్ద టేకుల గడ్డ ప్రాంతంలో 23 మంది వలస కార్మికులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌ను పరిస్థితులను సమీక్షించి చర్యలను వేగవంతం చేశారు.

09/25/2016 - 05:42

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24: జిల్లాలో కురుస్తున్న వర్షాలు జిల్లా ప్రజలకు శుభసూచికమని చెరువులు, కుంటలు నిండాయని అయితే కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు ప్రజలకు సూచించారు. అధికారులు కూడా వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు.

09/25/2016 - 05:40

ఒంగోలు, సెప్టెంబరు 24: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో దేశ ప్రధాని మోదీ, హోదా తెచ్చే విషయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.

09/25/2016 - 05:38

ఏలూరు, సెప్టెంబర్ 24:రాష్ట్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘దోమలపై దండయాత్ర’ ప్రారంభానికి ఏలూరు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యార్ధినీవిద్యార్ధులు, ప్రజలు దారిపొడవునా అపూర్వ స్వాగతం పలికారు. ఆయనతోపాటు వందలాది మంది విద్యార్ధులు దండుగా ప్రదర్శనలో పాల్గొనడంతో ప్రధాన రహదారి మొత్తం నిండిపోయింది.

09/25/2016 - 05:38

ఆకివీడు, సెప్టెంబర్ 24: త్వరలోనే ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీయచ్చారని ఎమ్మెల్యే శివరామరాజు తెలిపారు. శనివారం ఏలూరు వచ్చిన సిఎంకు బహుళ వినియోగ వాహనాలను ఎమ్మెల్యే శివరామరాజు చూపించారు. కచ్చా డ్రెయిన్‌ల తవ్వకానికి, పుంతరోడ్ల నిర్మాణానికి, మంచినీటి పైపులైన్ వేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని వివరించారు.

09/25/2016 - 05:38

ఏలూరు, సెప్టెంబర్ 24: జిల్లా కేంద్రమైన ఏలూరు పర్యటనకు శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పోలీసు రోప్‌పార్టీ కొంత అత్యుత్సాహం ప్రదర్శించింది. సిఎం పర్యటన చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వీడియో కెమెరామెన్లపై దురుసుగా ప్రవర్తించటంతోపాటు వారిని నెట్టివేయటంతో కొంతమంది రోడ్డుపై పడిపోయారు. ఈ దశలో కొన్ని ఛానళ్లకు చెందిన కెమెరాలు కూడా దెబ్బతిన్నాయి.

09/25/2016 - 05:37

గోపాలపురం, సెప్టెంబర్ 24: గోపాలపురం ఎంపిపి గద్దే వెంకటేశ్వరరావు (48) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మండలంలో వెంకటేశ్వరరావు సౌమ్యునిగా పేరుగాంచారు. గత ఎన్నికల అనంతరం ఎంపిపిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు.

09/25/2016 - 05:37

ఏలూరు, సెప్టెంబర్ 24: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలూరులో ప్రారంభించారు. అయితే దీనిలో కొంత ఆసక్తికరమైనరీతిలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి సభల్లో రాజకీయనాయకులు తమ వక్తృత్వ ప్రతిభను పూర్తిస్ధాయిలో ప్రదర్శించటం చూస్తుంటాము. కానీ ఈసభలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా జరిగింది.

09/25/2016 - 05:36

ఏలూరు, సెప్టెంబర్ 24 : ఒక్కో సీజన్‌లో దోమలు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ కారణంగా వ్యాధులు ప్రబలి మధ్యతరగతి, పేద కుటుంబాల భవిష్యత్తు తల్లకిందులవడం చూస్తూనే వున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దోమల ప్రభావం గట్టిగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Pages