S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 05:56

వరంగల్, సెప్టెంబర్ 24: వరంగల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

09/25/2016 - 05:56

గోవిందరావుపేట, సెప్టెంబర్ 24: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అన్నదాతలకు ప్రధాన కల్పతరువైన లక్నవరం చెఱువులోకి పూర్తిస్ధాయిలోకి నీరు వచ్చి చేరడంతో శనివారం నుండే చెఱువు మత్తడి పడుతుంది. గుండ్లవాగు ప్రాజెక్టు సైతం పూర్తిస్ధాయిలో నిండిపోవడంతో అన్నదాతలలో ఆనందం నెలకొంది.

09/25/2016 - 05:55

పరకాల, సెప్టెంబర్ 24: అకాశానికి చిల్లు పడిందా అన్న తరహాలో 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షానికి పరకాల నిలువెల్లా తడిసి ముద్దయింది. గురువారం వరుణుడి జోరు మొదలైంది. శుక్రవారం సాయంత్రం నుండి ప్రారంభమైన వర్షం శనివారం సాయంత్రం వరకు కొనసాగడంతో పరకాల పట్టణం ఆతలకుతలమైంది. పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయినాయి. ఇంట్లోకి నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడారు.

09/25/2016 - 05:55

రఘునాథపల్లి, సెప్టెంబర్ 24: గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగుపోస్తున్నాయి. శుక్రవారం రాత్రి మండలంలోని కోడూరు గ్రామంలోని పెద్దచెరువుకు మూడు గండ్లు పడడంతో చెరువు కట్ట తెగిపోయింది. దీంతో చెరువులోని నీరు అంతా పంట పొలాల్లోకి చేరి అపార నష్టం వాటిల్లింది. కాగా గ్రామస్థులు చాలా ఏళ్ల తర్వాత చెరువు నిండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

09/25/2016 - 05:54

వడ్డేపల్లి, సెప్టెంబర్ 24: గ్రామీణ ప్రజల అవసరాలు తెలుసుకుని వారికి సహాయం చేయడం, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడమే నిజమైన సేవ అని హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు అన్నారు. శనివారం వరంగల్ జిల్లా న్యాయస్థాన భవన సముదాయంలో బాల వికాస సుజల్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల వికాస కార్యక్రమాల ద్వారా ఎన్నో గ్రామాలు, ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని కొనియాడారు.

09/25/2016 - 05:54

మహబూబాబాద్, సెప్టెంబర్ 24: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ప్రశ్నించే వర్గాలపై తూటాలు పేలుతూనే ఉన్నాయని సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మానుకోటలో శనివారం ఏర్పాటు చేసిన ప్రముఖ కవి రుక్మిణి రాంరెడ్డి సంతాప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ్మినేని రుక్మిణి రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంతాప సభలో మాట్లాడుతూ..

09/25/2016 - 05:54

నర్సంపేట, సెప్టెంబర్ 24: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా శనివారం సైతం జోరుగా ముసురువాన కురుస్తూనే ఉంది. నాలుగు రోజులుగా వర్షాలు దంచికొడుతున్న విషయం అందరికి తెల్సిందే. నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డివిజన్‌లోని చెరువులు, కుంటలన్నీ నిండిపోయి మత్తళ్లు పోస్తున్నాయి. చిన్న చిన్న కాల్వలు తారు రోడ్లపై గల కాజ్‌వేలపై వరదనీటి ప్రవాహంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

09/25/2016 - 05:52

హుజూరాబాద్, సెప్టెంబర్ 24: రా ష్ట్రంలో కులవృత్తులకు ప్రభుత్వం చే యూతనిస్తుందని, నిరుద్యోగులు ఖాళీ గా సమయం వృధా చేయకుండా కులవృత్తులు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేంద ర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్‌లో శనివా రం మేకల, గొర్రెల పెంపకందార్ల సహాకార సంస్థ ఆధ్వర్యంలో రుణాల పం పిణీ కార్యక్రమం జరిగింది. 200 యూనిట్లకు రూ.

09/25/2016 - 05:50

నిజాంసాగర్, సెప్టెంబర్ 24: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయం రెండు రోజుల్లో పూర్థిస్థాయి నీటిమట్టంతోజలకళను సంతరించుకోనుందని, రాష్ట్ర వ్యవసాయ, సహకారా శాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు జడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతోకలిసి పరిశీలించారు. ప్రాజెక్ట్12,16,20 వరద గేట్లను పరిశీలించారు.

09/25/2016 - 05:48

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 24: ఆసిఫాబాద్ మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో అడ, ఆసిఫాబాద్ పెద్దవాగులతోపాటు, మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుమ్రం భీం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అధికారులు సాయంత్రం మూడు గేట్లు ఎత్తివేశారు.

Pages