S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐటా టెన్నిస్ పోటీల విజేత శశాంక్, జ్ఞానిత

గుంటూరు (స్పోర్ట్స్), ఆగస్టు 2: జిల్లా టెన్నిస్ సంఘ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న టెన్నిస్ పోటీల్లో అండర్-14 బాలుర విభాగంలో విశాఖపట్నంకు చెందిన శశాంక్, బాలికల విభాగంలో ఎ జ్ఞానిత విజేతలుగా నిలిచారు. రన్నర్స్ టైటిల్‌ను బాలుర విభాగంలో చెన్నైకు చెందిన కృష్ణకుమార్, బాలికల్లో గుంటూరుకు చెందిన లేళ్ల అశ్రీత సాధించారు. అండర్-14 బాలుర డబుల్స్ విభాగంలో చెన్నైకు చెందిన వరుణ్‌కుమార్, కె కృష్ణకుమార్‌ల జంట విజేతలుగా నిలవగా రన్నర్స్ టైటిల్‌ను వైజాగ్‌కు చెందిన గిరీష్, అనంతమణిలు సాధించారు. బాలికల డబుల్స్‌లో విన్నర్స్‌గా విశాఖపట్నంకు చెందిన శరణ్య, సాత్విక జంట, రన్నర్స్‌గా గుంటూరుకు చెందిన లేళ్ల అశ్రీత, సిహెచ్ ప్రవలిక సాధించారు. బహుమతి కార్యక్రమానికి మునిసిపల్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివసరావు, టెన్నిస్ సంఘ కార్యదర్శి కెఎస్ చారి ముఖ్యఅతిథులుగా విచ్చేసి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. స్టేడియం సంయుక్త కార్యదర్శి టి సంపత్‌కుమార్, టెన్నిస్ సంఘ ఉపాధ్యక్షుడు ఎస్‌ఎన్ కమల్, డాక్టర్ రాజేష్‌కుమార్, టెన్నిస్ శిక్షకులు ప్రసాద్, ఆనంద్, రిఫరీ శ్రీకుమార్, తదితరులు పాల్గొన్నారు.