S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఘాట్ల వద్ద రాత్రింబవళ్లూ వైద్యసేవలు

అమరావతి, ఆగస్టు 2: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆగస్టు 12 నుండి 23 వరకు స్థానిక పుష్కరఘాట్ల వద్ద 3 షిఫ్ట్‌లలో డే అండ్ నైట్ వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య తెలిపారు. మంగళవారం ఆమె జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి అమరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్నానఘాట్లు, ధ్యానబుద్ధ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ పుష్కరనగర్‌లు, బస్టాండ్‌తో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
ఇప్పటికే ఇతర జిల్లాల నుండి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ అమరావతి 30 పడకల ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందని, రెండు రోజుల్లో ఇద్దరు డాక్టర్లను శాశ్వత ప్రాతిపదికన పంపిస్తామని, త్వరలో సిబ్బంది కొరతను కూడా పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు.
ఆమె వెంట ఆరోగ్య వైద్యశాఖ డైరెక్టర్ అరుణకుమారి, డిఎంహెచ్‌ఒ పద్మజారాణి, డాక్టర్ కామేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.