S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 01:54

మదనపల్లె, జూలై 31 : మదనపల్లె మెప్మాలో మహిళాసంఘాల లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. పిఆర్‌పి, ఆర్‌పిలు చేతివాటం ప్రదర్శించి బినామి జాబితాలతో తీసుకున్న రుణాలు చెల్లించాలని మహిళా సంఘాలకు బ్యాంకు నోటీసులు రావడంపై మహిళలు మరోసారి ఆందోళనలకు సన్నద్ధం అవుతున్నారు.

08/01/2016 - 01:53

తిరుపతి, జూలై 31: ఎన్నికల ముందు వెంకన్న పాదాల సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

08/01/2016 - 01:53

తిరుపతి, జూలై 31: బల్డింగ్ కార్మికుల కోసం నిర్దేశించబడిన 12,500 కోట్లను చంద్రన్న బీమా పథకానికి వినియోగిస్తే సహించేదిలేదని ఎ ఐ టియుసి జిల్లా అధ్యక్షుడు మురళి హెచ్చరించారు. ఆదివారం ఎ ఐ టి యుసి నగర సమితి ఆధ్వర్యంలో సెజ్ నిధులను చంద్రన్న బీమా పథకానికి తరలించడాన్ని బస్టాండు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

08/01/2016 - 01:52

చిత్తూరు, జూలై 31 : జిల్లాలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు వాహనాలతో పాటు 4.6 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లాఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన చిత్తూరులో విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో దాడులు నిర్వహించి హజి, చక్రవర్తి అనే ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

08/01/2016 - 01:51

తిరుపతి, జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రజలను మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరతం పడతామని ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ నగర కార్యదర్శి మంజుల హెచ్చరించారు.

08/01/2016 - 01:51

తిరుపతి, జూలై 31: రాష్ట్రంలో నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించడం వల్ల తీవ్ర నష్టం జరుగనున్నదని ప్రముఖ విప్లవకవి జట్టి జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. విప్లవ కమ్యూనిస్టు నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర రావు వర్థంతి సభలు ఆదివారం స్థానిక యూత్ హాస్టల్‌లో నిర్వహించారు.

08/01/2016 - 01:43

కడప,జూలై 31: జిల్లాలో నాలుగురోజులుగా వర్షం కురుస్తుండటం, కర్నూలు జిల్లా దిగువప్రాంతాల నుంచి వర్షం నీరు జిల్లాలోని కుందు, పెన్నానదుల్లో నీటి ప్రవాహం మొదలైంది. కుందూకు వెయ్యిక్యూసెక్కుల నీరు పైబడి కర్నూలు జిల్లా దిగువ ప్రాంతాల నుంచి చేరాయి. అలాగే పెన్నానది నీటి ప్రవాహం పెరిగి ఆ నదుల్లో భాగంగా ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు నీరు చేరి పెన్నానది నుంచి ప్రవాహం మొదలైంది.

08/01/2016 - 01:42

కడప,జూలై 31: కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించడంతో అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం ఈనెల 2న రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చింది.

08/01/2016 - 01:42

కడప,జూలై 31: నేడు పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు జరుగనున్నాయి. పాఠశాలల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాల అభివృద్ధికమిటీ ఎన్నికలు జరుపుతోంది. ఆ ఎన్నికలు ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా రాజకీయ ఎన్నికల తరహాలో హోరాహోరీగా పోరుకొనసాగుతోంది.

08/01/2016 - 01:41

పులివెందుల, జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి పూర్తి సహాయసహకారాలు అందిస్తోందని బిజెపి రాష్ట్ర నాయకుడు కందుల రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బికె ఆర్ ఎం డిగ్రీ కళాశాలలో పార్టీ అసెంబ్లీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రెండురోజుల నుంచి ప్రత్యేక హోదాపై పలు రాజకీయ పార్టీలు రాజ్యసభలో మాట్లాడడం జరుగుతోందన్నారు.

Pages