S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 02:13

బిట్రగుంట, జూలై 31: బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప జాతీయ రహదారి మార్జిన్ పక్కన ఉన్న టీ దుకాణంలోకి లారీ దూసుకుపోవడంతో ఇద్దరు మహిళలు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

08/01/2016 - 02:13

చిల్లకూరు, జూలై 31: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం మండలంలోని వరగలి, వల్లిపేడు గ్రామాల్లో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వైద్యుల కొరత అధికంగా ఉండటంతో 1400 మంది వైద్యుల పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు.

08/01/2016 - 02:12

నెల్లూరుసిటీ, జూలై 31: ఆర్య వైశ్యులంతా చిన్న చిన్న మనస్పర్థలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని తమిళనాడు గవర్నర్ రోశయ్య పిలుపునిచ్చారు. ఆదివారం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్టోన్‌హౌస్ పేటలోని ఎస్‌బిఎస్ కల్యాణ మండపం పక్కన నిర్మించిన ఆర్యవైశ్య భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

08/01/2016 - 02:12

వెంకటాచలం, జూలై 31 : వెంకటాచలం రైల్వేగేటు వద్ద గత కొనే్నళ్ల నుంచి నివాసముంటున్న విశ్రాంత ఎస్‌ఐ షేక్ ఖాసీం ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 18 సవర్ల బంగారంతో పాటు మొత్తం 5 లక్షలు విలువ చేసే వస్తువులు అపహరించుకుని వెళ్లారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇంట్లో ఖాసీం భార్య భర్తలు నివాసం ఉంటున్నారు.

08/01/2016 - 02:11

వేదాయపాళెం, జూలై 31 : కేంద్ర, రాష్ట్ర మంత్రులు పూటకో మాట మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా విద్యార్థి జెఎసి జిల్లా కన్వీనర్ డి.అంజయ్య ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం అన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యోగ, కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

08/01/2016 - 02:11

వేదాయపాళెం, జూలై 31 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రితో సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పూర్తిగా వైఫల్యం చెందారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ సలహాదారుడు హెచ్‌ఎం. సుహాని విమర్శించారు. నగరంలోని స్థానిక విఆర్‌సి మైదానంలో ఆదివారం జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

08/01/2016 - 02:10

వెంకటాచలం, జూలై 31 : దక్షణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలి దర్గాను ఆదివారం తెలుగు చలన చిత్ర ప్రముఖ హాస్యనటుడు అలీ దర్శించుకున్నారు. ఆయనకు దర్గా ముజావర్లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అలీ తలపై దుప్పటి, పూల చాదర్‌లు పెట్టుకుని దర్గాలో మస్తాన్ స్వామి సమాధి చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం అలీ పేరిట దర్గా ముజావర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆయనకు ప్రసాదం అందజేశారు.

08/01/2016 - 02:09

కర్నూలు సిటీ, జూలై 31:కృష్ణా పుష్కరాలకు వచ్చే ప్రతి వ్యక్తిని అతిథిగా భావించి విధులను సక్రమంగా నిర్వహించి పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించే అధికారులకు ఆదివారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం అధికారులు ‘హౌ టు కంట్రోల్ క్రౌడ్’ అనే అంశంపై శిక్షణ ఇచ్చారు.

08/01/2016 - 02:08

కర్నూలు సిటీ, జూలై 31:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది రాజకీయ లబ్ధి కోసం కాదని, ప్రజా ప్రయోజనాల కోసమే అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా గౌరుతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు.

08/01/2016 - 02:08

కర్నూలు సిటీ, జూలై 31:రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బిజెపి మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిసిసి అధ్యక్షుడు బివై.రామయ్య డిమాండ్ చేశారు.

Pages