S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 02:02

పాములపాడు, జూలై 31:శ్రీశైలం మండల పరిధిలోని సున్నిపెంట గ్రామానికి చెందిన రహిమాన్(36) ఆదివారం బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. రహిమాన్ శ్రీశైలం జలాశయంలోని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కలిపే లింగాలగట్టు బ్రిడ్జి వద్ద సూమారు 50 అడుగుల ఎత్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.

08/01/2016 - 02:00

రాజమహేంద్రవరం, జూలై 31: మరొక్కసారి నది పట్ల భక్త్భివం వెల్లి విరిసింది.. అంత్య పుష్కరాలకు గోదావరి నదిలో పుణ్య స్నానం ఆచరించి పునీతమయ్యేందుకు అశేష భక్తజనం అఖండ గోదావరి వైపు పరుగులు తీస్తున్నారు. మొదటి రోజు రద్దీపై దృష్టి పెట్టుకుని అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. అంత్య పుష్కరాలకు ఎంతమంది వస్తారనేది ఇదమిద్ధంగా అధికారులు అంచనాలకు రాలేకపోయారు.

08/01/2016 - 02:00

రాజమహేంద్రవరం, జూలై 31: ప్రత్యేక హోదాకు కట్టుబడి వున్నామని, కేంద్రంపై వత్తిడి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సిఎం చినరాజప్ప అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పక్కనబెట్టే ధోరణి కన్పిస్తోందన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం అంత్య పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

08/01/2016 - 01:59

రాజమహేంద్రవరం, జూలై 31: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి, మళ్లీ దేశాన్ని ఈస్టిండియా కంపెనీ పాలన వైపు నడిపిస్తోందని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తోందని విమర్శించారు.

08/01/2016 - 01:59

రామచంద్రపురం, జూలై 31: అంత్య పుష్కరాలను పురస్కరించుకుని భక్తజనుల పుణ్యస్నానాలతో గోదావరి మాత పులకరిస్తోంది. గోదావరి మహానదికి అంత్య పుష్కరాలను ఆదివారం ఉదయం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గోదావరి మాతకు అర్చనలు చేసి, ప్రారంభించారు.

08/01/2016 - 01:58

కాకినాడ, జూలై 31: గడచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇచ్చిన నిధుల వివరాలను శే్వతపత్రం ద్వారా వెల్లడించాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను తుంగలోకి తొక్కిన కేంద్రం చేతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలుబొమ్మగా మారారని ఆరోపించారు.

08/01/2016 - 01:57

యానాం, జూలై 31: యానాంలో గోదావరి అంత్య పుష్కరాలను పుదుచ్చేరి వైద్య శాఖామాత్యులు మల్లాడి కృష్ణారావు ఆదివారం ప్రారంభించారు. శివం ఘాట్ వద్ద ఏడాది క్రితం ఏర్పాటు చేసిన పుష్కరిణి మాత విగ్రహం వద్ద వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులు అంత్య పుష్కరాలను ప్రారంభించారు.

08/01/2016 - 01:56

రేణిగుంట, జూలై 31: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ, గుండె, లివర్‌ను నెల్లూరు, హైదరాబాద్, వైజాగ్‌కు విజయవంతంగా పోలీసుల సాయంతో తరలించారు.

08/01/2016 - 01:55

తిరుపతి, జూలై 31: తిరుపతి అర్బన్ ఎస్ పి ఆర్. జయలక్ష్మి ఆదేశాల మేరకు ఎ ఎస్పీ ఎంవి ఎస్ స్వామి పర్యవేక్షణంలో, వెస్ట్ డి ఎస్పీ కనకరాజు ఆదివారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జీవకోనలో గల కాంత్రినగర్, రాజీవ్‌గాంధీ కాలనీలో కార్టన్-సెర్చ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులున్నాయని, చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమచారం రావడంతో నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు.

08/01/2016 - 01:54

మదనపల్లె, జూలై 31: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పడమటి ప్రాంతంలోని టమోటా సాగు పూర్తిగా దెబ్బతిన్నది. వరుణుడు రైతుల్లో ఆశలు రేకెత్తించినా ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ, టమోటా, వరిసాగు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పడమటి కరవు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ దిగుబడులు ఇస్తున్న జిల్లా టమోటాలకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, గోవా ప్రాంతాల్లో డిమాండ్ కలిసొస్తోంది.

Pages