S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 02:07

మంత్రాలయం, జూలై 31:మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంధ్ర తీర్థులు ఆదివారం చాతుర్మాస దీక్షను స్వీకరించారు. 41రోజులు చేపట్టిన ఛాతుర్మాస ధీక్షలో బాగంగా ముందుగా గ్రామదేవత మంచాలమ్మకు పూజలు చేసి, శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. మఠంలో కొలువైన పూర్వపు పీఠాధిపతుల బృందావనాలకు ప్రత్యేక పూజలు చేశారు.

08/01/2016 - 02:06

చాగలమర్రి, జూలై 31 : మండల పరిధిలోని చాగలమర్రితో పాటు బ్రాహ్మణపల్లె, చిన్నవంగలి, తోడేండ్లపల్లె, ముత్యాలపాడు తండా తదితర గ్రామాల్లో వర్షాల వల్ల అతిసార ప్రబలింది. ఆదివారం స్థానిక కేరళ ఆసుపత్రిలో వాంతులు, బేదులతో 40మంది చికిత్స పొందుతున్నారు. గత 5రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అపరిశుభ్రత లోపించి ప్రజలు వ్యాధులకు గురవుతున్నారు. వృద్ధులు, యువకులు అతిసారబారిన పడుతున్నారు.

08/01/2016 - 02:06

నంద్యాల, జూలై 31:ఆంధ్రప్రదేశ్ చెవి, ముక్కు, గొంతు వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నంద్యాల మధుమణి ఇఎన్‌టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణలో ఆదివారం 6వ రాష్టస్థ్రాయి ఇఎన్‌టి శస్త్ర చికిత్సల వర్క్‌షాపు ప్రారంభమైంది.

08/01/2016 - 02:05

బనగానపల్లె, జూలై 31:పట్టణంలోని బేతంచర్ల రోడ్డులో వెలసిన శ్రీదస్తగిరి స్వామి దర్గా 5వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్న శ్రీ సయ్యద్ అబ్దుల్ హుస్సేన్‌ను ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే బిసి ఆదివారం ఉదయం దస్తగిరి స్వామి దర్గా వద్దకు వెళ్లి శ్రీ అబ్దుల్ హుస్సేన్‌ను శాలువా, పూలమాలలతో సత్కరించి, మిఠాయిలు అందజేసి అభినందించారు.

08/01/2016 - 02:05

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 31:దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్థానిక బి.క్యాంపులోని బిసి భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ సాధన కోసం బిసిలందరూ ఏకతాటిపై నిలబడి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

08/01/2016 - 02:04

పాములపాడు, జూలై 31:కృష్ణా పుష్కరాల్లో భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ తెలిపారు. శ్రీశైలం టూటౌన్ ఔట్‌పోస్టులో ఆదివారం ఆమె విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ సున్నిపెంట గ్రామంలోని లాడ్జిలు, హోటళ్ల యజమానులను సమావేశపరచి హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేశామన్నారు.

08/01/2016 - 02:04

ఆదోనిటౌన్, జూలై 31:ఎంపి బుట్టారేణుక నిధులతో నిర్మించనున్న షాదీఖానాకు రాంజలకు వెళ్ళే ప్రధాన రోడ్డులో స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

08/01/2016 - 02:03

కోడుమూరు, జూలై 31:శ్రావణమాస అమావాస్య ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం భక్తులు కోడుమూరు నుంచి శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధికి పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. తొలుత వారు స్థానిక సాయిబాబా మందిరం నుంచి పట్టణ పురవీధుల గుండా ఉరుకుంద ఈరన్న స్వామి నామస్మరణ చేసుకుంటూ బయల్దేరారు.

08/01/2016 - 02:03

బేతంచెర్ల, జూలై 31:్భవిష్యత్తు తరాల మన పిల్లలు పస్తులు ఉండకూడదంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించి ఆంధ్రుల ఐక్యతను ఢిల్లీకి విన్పించేలాగా గర్జించాలని మండల జెఎసి, జర్నలిస్టుల యూనియన్ నాయకులు కె.సుబ్బారెడ్డి, వెంకట్రాముడు, ఆజాంబేగ్, సిపిఎం, సిఐటియు నాయకులు యల్లయ్య, సుబ్బరాయుడు పిలుపునిచ్చారు.

08/01/2016 - 02:02

ఓర్వకల్లు, జూలై 31:మండల పరిధిలోని హుసేనాపురం గ్రామం కల్వర్టు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జూపాడుబంగ్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దేవానందం(46) దుర్మరణం చెందాడు. దేవానందం ద్విచక్ర వాహనంపై కర్నూలు వైపు వస్తూ హుసేనాపురం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఓర్వకల్లు ఎస్‌ఐ చంద్రబాబునాయుడు తెలిపారు.

Pages