S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నత్తనడకన చెన్నూరు హైవే వంతెన నిర్మాణ పనులు..

చెన్నూరు,జూలై 31:కడప -కర్నూలు జాతీయ రహదారిలోని స్థానిక పెన్నానదిపై నిర్మించతలపెట్టిన రెండవ వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణ పనులు చేపట్టి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు పూర్తి చేయడం లేదు. హైవే పాతవంతెన స్థానంలో వంతెన పైభాగంలో ఉన్న గడ్డర్లు తొలగించి వాటి స్థానంలో కొత్తగా గడ్డర్లు ఏర్పాటుచేసి నిర్మాణ పనులు పూర్తి చేయాల్సివుంది. నాలుగేళ్లకిందట కొత్తవంతెన నిర్మిస్తున్న సమయంలో పాత వంతెనపై ఎక్కువ వాహనాలు వెళుతుండటం వల్ల వంతెన మధ్యలో గడ్డర్లు దెబ్బతినడంతో అప్పటి హైవే అధికారులు వంతెనపై వాహనాలు నిలిపివేశారు. వంతెనను పరిశీలించేందుకు ఢిల్లీ, ముంబాయికి చెందిన పలువురు శాస్తవ్రేత్తలు వంతెన పరిశీలించగా పాతవంతెన బీమ్‌లు పటిష్టంగా ఉన్నాయని, వంతెన పై భాగంలో గడ్డర్లు తొలగించి పూర్తిగా వంతెన నిర్మాణపనులు చేపట్టాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో అప్పటి హైవే అధికారుల సూచనల మేరకు వంతెన నిర్మాణ పనులకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసింది. దీంతో కెఎంసి కంపెనీ వారు పాతవంతెన నిర్మాణ పనులు చేపట్టారు.
వంతెన పై భాగంలో ఉన్న గడ్డర్లు తొలగించి నప్పటికీ వంతెన నిర్మాణ పనులు చేపట్టలేదు. ఇటీవల రెండు నెలల నుంచి వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు కెఎంసి అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. వంతెనకు పెద్ద పెద్ద గడ్డర్లు వంతెనపై ఏర్పాటుచేయాల్సివుంది. కానీ పనులు వేగవంతం చేయడంలో ఆలస్యం జరుగుతుండటం వంతెన దగ్గర నుంచి చెన్నూరు పెట్రోల్ బంకు, కొత్తరోడ్డు, బెస్తకాలనీ, బుడ్డాయపల్లె వరకు రోడ్డుపనులకు పూర్తిగా ఆటంకం కలుగుతుంది. ఒకవైపేరోడ్డు ఏర్పాటుచేయడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.