నేరగాళ్ల పైకి ఇక పోకెమాన్!
Published Monday, 1 August 2016వాషింగ్టన్, జూలై 31: ఇప్పటివరకు పొకెమాన్ను పట్టుకోవటమే అన్ని దేశాల యువత పనిగా పెట్టుకున్న నేపథ్యంలో అమెరికా ఓ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఏకంగా నేరగాళ్లను పట్టుకోవటానికి పోకెమాన్ అస్త్రాన్ని ప్రయోగించేదిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పోకెమాన్ గో క్రేజ్ అన్ని దేశాల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్న తరుణంలో వర్జీనియాకు చెందిన పోలీస్ విభాగం ఈ వినూత్న ఆలోచనతో తెరపైకి వచ్చింది. ఈ పోలీస్ స్టేషన్ ప్రాసెసింగ్ రూమ్‌లోనే నవ్వే పోకెమాన్ బొమ్మను తగిలించాలని నిర్ణయించింది. అంతేకాదు పోకెమాన్‌ను పట్టుకోవటానికి ఇదో సువర్ణావకాశం అంటూ ఫేస్బుక్లో ప్రచారం కూడా చేస్తోంది. ఈ ప్రయత్నంలో నిజమెంత ఉన్నా, నేరగాళ్లను పట్టుకోవటానికి తాము మాత్రం సీరియస్‌గా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.