S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 15:41

ఆస్టిన్:అమెరికాలోని ఆస్టిన్ నగరంలో శనివారం పొథ్దుపోయిన తరువాత కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. బార్లు, క్లబ్బులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు గాయపడ్డారు. కాల్పులు జరిపినది ఎవరు, ఎందుకు అన్నది ఇంకా తెలియలేదు.

07/31/2016 - 08:44

అనంతపురం కల్చరల్, జూలై 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యపడదన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. సిపిఎం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుండి టవర్‌క్లాక్ సర్కిల్ వరకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి దహనం చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇంతియాజ్ టిడిపి, బిజెపిల వైఖరిని విమర్శించారు.

07/31/2016 - 08:42

రాజంపేట టౌన్, జూలై 30:ప్రభుత్వాసుపత్రులలో పార్ట్‌టైమ్‌గా విధులు నిర్వహించే వైద్యుల మాకువద్దు, పుల్‌టైమ్ విధులు నిర్వహించి, ప్రజలకు సేవలందించే వైద్యులే అవసరమని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం మంత్రి రాజంపేట ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు.

07/31/2016 - 08:39

తిరుపతి, జూలై 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఆంధ్రరాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన బిజెపి, టిడిపి మోసగాళ్లపై వైఎస్‌ఆర్ సిపి అధినేత జగన్ పోరాడటానికి బంద్‌కు పిలుపునిచ్చారని, ఈబంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

07/31/2016 - 08:38

కర్నూలు, జూలై 30:రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో చేతులు కలిపామని ఆ ప్రయోజనాలు నెరవేరవని స్పష్టమవుతున్న సమయం రావడంతో ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని రాజ్యసభ సభ్యు డు టిజి వెంకటేష్ వెల్లడించారు. నగరంలోని తన కార్యాలయంలో శనివా రం టిజి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/31/2016 - 08:31

నెల్లూరుసిటీ, జూలై 30: రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

07/31/2016 - 08:30

పర్చూరు, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కల్పిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకుని బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలని ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చెంగవల్లి వెంకట్ అన్నారు. మండల కేంద్రమైన పర్చూరులోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు జరిగింది.

07/31/2016 - 08:28

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం

07/31/2016 - 08:27

విజయనగరం, జూలై 30: విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపి ఉన్నతి సాధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించి వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. విజయనగరం పట్టణంలో 2.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని కేంద్రమంత్రి అశోక్ శనివారం ప్రారంభించారు.

07/31/2016 - 08:24

భీమవరం, జూలై 30: స్థానిక ప్రకాశం చౌక్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.

Pages