S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 07:01

హైదరాబాద్, జూలై 30: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ దుండగుడిని సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా న్యాలకల్ మండలానికి చెందిన ఉషాల యాదులు అలియాస్ యాది (33) గత కొంతకాలంగా మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మగూడలో నివాసముంటున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

07/31/2016 - 07:01

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్-2 లీకేజీకి అసలు కారకులైన వారిని వదిలేసి మధ్యలో వచ్చిన బ్రోకర్లపై ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నదని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఎంసెట్-2 లీకేజిపై సిఐడి ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతృప్తిగా ఉన్నారా? అని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

07/31/2016 - 07:00

అది శ్రావణ శుద్ధ విదియ. అది అందరికీ మంచి రోజు కాకపోవచ్చు. కాని మాకు మాత్రం మంచిరోజే. ఎందుకంటే ఆ రోజే దేవలోకంలో హాయిగా ఉన్న మా కోసం మేమంతా కలసికట్టుగా మా నాన్నగారిని స్మరించుకుని ఆహ్వానించేరోజు.

07/31/2016 - 07:00

హైదరాబాద్/గచ్చిబౌలి, జూలై 30: మద్యం ప్రాణాంతకమని, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమనే నినాదాలు మద్యం బాటిళ్లపై ముద్రించే యోచనలో ఉన్నామని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.చంద్రవదన్ తెలిపారు. శనివారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ‘అండర్ ఏజ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్’పై అవగాహన సదస్సు జరిగింది.

07/31/2016 - 06:50

మచిలీపట్నం, జూలై 30: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ హోంగార్డు తన ఇద్దరు పిల్లలు సహా అదృశ్యమయ్యాడు. శనివారం చిన్నారి మృతదేహం లభ్యం కావటంతో పిల్లలతో సహా అతను సాగర సంగమం వద్ద నదిలో దూకి వుంటాడని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన యడ్లపల్లి వెంకట రమేష్ బాబు(32) చల్లపల్లి పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రమేష్ కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి.

07/31/2016 - 06:49

చిత్తూరు, జూలై 30: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గ కేంద్రమైన మేజర్ పంచాయతీ కుప్పంలో ఆ పార్టీలో అనిశ్చితి నెలకొంది. కుప్పం సర్పంచ్, వైస్ సర్పంచ్ వర్గీయుల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా కుప్పంలో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

07/31/2016 - 06:48

రాజమహేంద్రవరం, జూలై 30: అంత్య పుష్కరాలకు రాజమహేంద్రవరం నగరం ఇనుప బ్యారికడ్ల నడుమ ఉక్కిరిబిక్కిరి కానుంది. అంతంతమాత్రంగా భక్తులు తరలివచ్చే అంత్య పుష్కరాలకు రాజమహేంద్రవరం కేంద్రంగా సాగుతున్న భద్రతాఏర్పాట్లపై పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

07/31/2016 - 06:48

విజయవాడ, జూలై 30: కృష్ణా పుష్కరాల సందర్భంగా రహదారుల విస్తరణ పేరిట విజయవాడ నగరంలో ప్రార్థనా మందిరాలు, జాతీ య నేతల విగ్రహాల తొలగింపులో భాగంగా శనివారం తెల్లవారుజామున నగర నడిబొడ్డులో ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని 12 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం తొలగింపు అధికారుల దుందుడుకు చర్యలకు పరాకాష్ఠగా నిలిచింది.

07/31/2016 - 06:45

హైదరాబాద్, జూలై 30: ప్రత్యేక హోదాపై ఏపిలో నాలుగు స్తంభాలాట కొనసాగుతోంది. నాలుగు ప్రధాన పార్టీలు ఎవరికి వారు రాజకీయ ప్రయోజనం పొందేందుకు పరుగులు తీస్తున్నాయి. అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, దానిని సమర్థించి ఇప్పుడు చిక్కుల్లో పడిన భాజపా హోదాపై రాజకీయ క్రీడల్లో మునిగిపోయాయి.

07/31/2016 - 06:44

విశాఖపట్నం, జూలై 30: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ శనివారం ఉదయం హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఎయు సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించే సౌకర్యాన్ని శనివారం ప్రారంభించిన నేపథ్యంలో ఇది జరగడం గమనార్హం. ఉదయం 7 గంటల ప్రాంతంలో ‘ఆంధ్రాయూనివర్సిటీ.ఎడ్యు.

Pages