S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 08:22

రాజమహేంద్రవరం, జూలై 30: గోదావరి తీరంలో అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక సోయగం వెల్లివిరుస్తోంది. అంత్య పుష్కర స్నానాలు ఆచరించి ప్రాచీన క్షేత్రాల్లో దైవదర్శనం చేసుకునేందుకు భక్తజనం మరొకసారి రాజమహేంద్రవరం తరలివచ్చేందుకు రంగం సిద్ధమైంది. భక్తుల కోసం స్నానఘట్టాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు స్వాగతం పలుకుతున్నాయి.

07/31/2016 - 08:20

గూడెంకొత్తవీది, జూలై 30: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సిపిఐ మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాలు విజయవంతం చేసేందుకు లోతట్టు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తుంటే వాటిని అడ్డుకునేందుకు ఆంధ్రా ఒడిశా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.

07/31/2016 - 08:18

గుంటూరు (కొత్తపేట), జూలై 30: ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిరసన ప్రదర్శన, ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధంతో ఆందోళన నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

07/31/2016 - 08:16

భద్రాచలం, జూలై 30: ఏ నదికీ లేని వైభవం ఒక్క గోదావరి మాతకు మాత్రమే ఉంది. గోదావరి నదికి ఆది పుష్కరాలతో పాటుగా అంత్య పుష్కరాలు కూడా ఉన్నాయి. నేటి నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. 12 రాశుల్లో సింహరాశి ఐదవది. గురువు సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు వచ్చే నదుల్లో ఐదోది గోదావరి. సింహరాశికి అధిపతి సూర్యుడు.

07/31/2016 - 08:14

ఖమ్మం, జూలై 29: ఎంసెట్ మెడికల్ పరీక్షాపత్రం లీకేజి వ్యవహారంపై ఖమ్మం జిల్లా వ్యక్తుల పాత్ర కీలకమని తేలడంతో సిబి సిఐడి అధికారులు శుక్రవారం ఖమ్మంలో విచారణ చేపట్టారు. ప్రముఖ కార్పొరేట్ కళాశాల అధినేత కూతురుకు వందలోపు ర్యాంకు రావడం, లీకేజిలో వారిపాత్ర ఉన్నదనే ఆరోపణలు వచ్చాయనే కారణంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.

07/31/2016 - 08:11

వరంగల్, జూలై 30: రాష్ట్రంలో 2019లో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషితో ముందుకు పోవాలని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని అభిరాం గార్డెన్‌లో జరిగిన బూత్ కమిటీ సమ్మేళన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

07/31/2016 - 08:11

ఇందూర్, జూలై 30: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ యోగితారాణా ఆదేశించారు. శనివారం వర్ని ఎంపిడిఓ కార్యాలయంలో సర్పంచ్‌లు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, ఐసిడిఎస్, ఆరోగ్య శాఖ సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎంలు, ఐకెపి ఎపిఎంలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.

07/31/2016 - 08:07

నార్కట్‌పల్లి, జూలై 30: ఎంసెట్-2ను రద్ధు చేయడం అన్యాయమని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నార్కట్‌పల్లిలో విలేఖరులతో మాట్లాడుతు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎంసెట్‌ను రద్ధు చేయడం ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు.

07/31/2016 - 08:06

తొగుట,జూలై 30: కృష్ణా పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి అన్నారు. శనివారం మండలంలోని తొగుట రాంపూర్ శారదాక్షేత్రం ఫీఠాధిపతి మాధవానందస్వామికి పుష్కరాల ఆహ్వాన పత్రికను కమిటి సభ్యులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా స్వామి ఆశీస్సులు పొందారు.

07/31/2016 - 08:03

మహబూబ్‌నగర్, జూలై 30: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అధికారులకు సూచించారు. బార్ కేడింగ్ స్టాల్స్ కోసం వేసే టెంట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా రవాణ, రహదారి నియంత్రణ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Pages