S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘హోదా’ కోసం నిరసనలు

అనంతపురం కల్చరల్, జూలై 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యపడదన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. సిపిఎం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుండి టవర్‌క్లాక్ సర్కిల్ వరకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి దహనం చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇంతియాజ్ టిడిపి, బిజెపిల వైఖరిని విమర్శించారు. పలువురు సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. వైకాపా నాయకులు ఎపి రాష్ట్రానికి చంద్రబాబు, వెంకయ్య, మోదీ ద్రోహం చేశాయని పేర్కొంటూ వారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టవర్‌క్లాక్ సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకరనారయణ, ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
6న సిఎం జిల్లా పర్యటన
* పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం సిటీ, జూలై 30: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 6వ తేదీన జిల్లాకు విచ్చేయనున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో సిఎం ఏర్పాట్లుపై జూయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 6వ తేదీన పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు వస్తారని, అక్కడ నుండి ధర్మవరంలో జరిగే చేనేత రుణమాఫీ రాష్టస్థ్రాయి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ధర్మవరంలోను ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ధర్మవరం చేనేత కార్యక్రమం అనంతరం బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తి సంఘాలు రాష్టస్థ్రాయి సమావేశం(యస్‌పిఓ)లో పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబందించి హెలిప్యాడ్, వేదిక, సీటింగ్ ఏర్పాట్లు, తాగునీరు తదితర ఏర్పాట్లును సంబంధిత అధికారులందరూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. సమావేశాలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లును చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను అధికారులందరు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, డిఆర్‌ఓ హేమసాగర్, ఆర్‌డిఓ మలొలా, జెడ్పి సిఇఓ రామచంద్ర, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఆర్ అండ్‌బి ఎస్‌ఇ మాధవీ సుకన్య, ఎస్‌పిడిసియల్ ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి, డిపిఓ జగదీశ్వరమ్మ, సమాచార శాఖ ఏడి తిమ్మప్ప, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టిడిపి వల్లే రాష్ట్రానికి ‘హోదా’ రావడం లేదు
* పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి
మడకశిర, జూలై 30: తెలుగుదేశం పార్టీ నిర్వాకం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి ఆదుకోవాలని రాజ్యసభలో కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు సభ్యుడి బిల్లుకు దేశంలోని పలు రాజకీయపార్టీలు మద్దతు తెలిపి కేంద్రంపై ఒత్తిడి పెంచాయన్నారు. అయితే టిడిపి ఎంపిలు, రాజ్యసభ సభ్యులు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదన్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, సిఎం రమేష్ పొంతన లేని విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. విభజన చట్టానికి, 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేకపోయినా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అందులో పేర్కొనలేదని చెప్పడం విడ్డూరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చీకటి ఒప్పందం చేసుకున్నారని, అందులో భాగంగానే ప్రత్యేక హోదా గురించి బాబు మాట్లాడడం లేదన్నారు. ఓ పక్క కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తూ, మరోపక్క ఇక ఢిల్లీకి వెళ్ళను అన్ని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. బిజెపి, టిడిపి కుమ్మకై నాటకాలు ఆడుతున్నాయన్నారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారే బుద్దిచెబుతారన్నారు. ఆగస్టు 5న రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ఓటింగ్‌కు తీసుకువస్తామని, దీనికి దేశంలోని మిగతా పార్టీల మద్దతు ఉందన్నారు.

పప్పుచారుతో సరిపెట్టేస్తున్నారు!
* ఉడికీ ఉడకని అన్నం.. * నాణ్యత లేని మధ్యాహ్న భోజనం
నల్లమాడ, జూలై 30: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థినీ విద్యార్థుల కోసం వండే మధ్యాహ్న భోజనంలో వంట ఏజెన్సీల వారు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అన్ని పాఠశాలల్లోనూ ఉడికీ ఉడకని ముద్దవుతున్న అన్నంతోపాటు కేవలం రంగు నీళ్లను తలపించే కూరలు వండి పిల్లలకు వడ్డిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ లేకపోలేదు. జిల్లా వ్యాప్తంగా వున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వ నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం వండాల్సి వుంది. అయినప్పటికీ ఏ ఒక్క ఏజెన్సీ వారు కూడా మెనూను పాటించకుండా విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం వడ్డిస్తున్నప్పటికీ ఏ అధికారి కూడా నోరుమెదపడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు లక్షా 8 వేల 753మంది విద్యార్థినీ విద్యార్థులు, 6నుంచి 10వ తరగతి వరకు లక్షా 9 వేల 320మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక్కొక్కరికి రూ. 4.86లు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ. 6.78 పైసలు ప్రభుత్వం ద్వారా బిల్లులు అందుతున్నాయి. ఈ మొత్తంలోనే వారానికి రెండుసార్లు కోడిగ్రుడ్లను కూడా విద్యార్థులకు విధిగా అందజేయాల్సి వుంది. కోడిగ్రుడ్లను తినని వారికి అరటి పండ్లు అందజేయాల్సి వుంది. అయితే వంట ఏజెన్సీల వారు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కోడిగ్రుడ్లను అందజేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వారంలో ఒక రోజు కోడిగ్రుడ్డు, ఒక రోజు అరటిపండును అందజేస్తున్నారు. కేవలం మండల కేంద్రాలు, అధికారులు ఎక్కువగా పర్యవేక్షణ జరిపే అవకాశం వున్న పాఠశాలల్లో మాత్రమే ఈ విధంగా చేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం కేంద్ర ప్రభుత్వం 75శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం నిధులు విడుదలయ్యేవి. కాగా ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం 60శాతం మాత్రమే భరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించాల్సి వుంది. దాంతో పూర్తిగా 9, 10వ తరగతికి చెందిన జిల్లాలోని 66,852మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులే వినియోగిస్తారని సమాచారం. గతేడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థుల కోసం (బియ్యంతోపాటు అన్ని రవాణా, అవసరమయ్యే ఖర్చులన్నీ కలిపి) రూ. 59 కోట్ల 51 లక్షలు నిధులు ఖర్చయినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 9 కోట్ల 7 లక్షలు మధ్యాహ్న భోజనం కోసం జిల్లాకు విడుదలైనట్లు సమాచారం. కాగా మధ్యాహ్న భోజనం కోసం ఇప్పటి వరకు అందజేస్తున్న మొత్తానికి 7శాతం పెంచినట్లు అధికారిక (అమలుకావాల్సి వుంది) సమాచారం. అంటే 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు రూ 4.86పైసలు వస్తుండగా పెంచిన ధరలు అమలైతే రూ. 5.13పైసలు, 6నుంచి 10వరకు చదివే విద్యార్థులకు ఇప్పటివరకు రూ. 6.78పైసలు వస్తుండగా పెంచిన ధరలు అమలైతే రూ. 7.18పైసలు ఒక్కో విద్యార్థికి చెప్పున అందజేసే అవకాశం వుంది. విద్యార్థినీ విద్యార్థులకు మంచి పోషక విలువలున్న ఆకుకూరలు, కాయగూరలతో వండి భోజనాలు వడ్డించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీపడకుండా నిధులను విడుదల చేస్తున్నప్పటికీ విద్యార్థులకు న్యాయం జరగడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యంగా వంట ఏజెన్సీల నియామకాల విషయంలో రాజకీయ ప్రమేయం వుండటంతో పర్యవేక్షణ జరపాల్సిన అధికారులు కూడా మిన్నకుండి పోతున్నట్లు తెలుస్తోంది. కనీసం భోజనం కోసం ధరలు పెంచాక అయినా నాణ్యమైన, పోషక విలువలున్న భోజనం విద్యార్థినీ విద్యార్థులకు వడ్డించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రత్యేక హోదాపై
తప్పుడు ప్రచారం మానుకోండి..
* బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి
తాడిపత్రి, జూలై 30: ప్రత్యేక హోదా బూచిని చూపి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేరని, ఇప్పటికైనా కాంగ్రెస్, కమ్యూనిస్టు, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తప్పుడు ప్రచారాలు, నిందారోపణలను మోపడం మానుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ఆలోచించాలని బిజేపి జిల్లా అధ్యకులు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి కోరారు. స్థానిక ప్యారడైజ్ హోటల్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనాంతరం ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందన్నారు. ఇప్పటికి ఆంధ్రాకు అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి ప్రణాళికలను రూపొందించి కేంద్రానికి ఇవ్వకుండానే నిధులు అడగడం సరికాదని, డిపిఆర్ ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చి నిధులు అడగాలని కోరారు. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. ప్రత్యేక హోదాను పొందిన రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదని, వెనుకబడి ఉన్నాయని తెలిపారు. ఆ రాష్ట్రాలను చూసి బిజేపి ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజిగా 15 వేల కోట్లను ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా వుందని, అదనంగా మరిన్ని నిధులు ఇవ్వనుందని తెలిపారు. అవినీతి పార్టీలు అభివృద్ధి నిరోధకం కలిగించేలా ప్రత్యేక హోదా పేరుతో సమస్యలను సృష్టిస్తున్నాయని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అనంతరం తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌చార్జి లక్ష్మిదేవి, జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో బిజేపి విస్తరణపై చర్చించనున్నామని తెలిపారు. ప్రతి బూత్‌లో బూత్ కమిటీని ఏర్పాటుచేసి, పార్టీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసి, ఆ పథకాలలో ప్రజలను లబ్దిదారులుగా చేరేలా ప్రయత్నించాలన్నారు. ఆగష్టు 8, 9, 10న అనంతపురం ఇంటెల్ కళాశాలలో శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో 7 నియోజకవర్గాలలో శిక్షణ నిర్వహించి, అందులో 2 వేల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం 48గంటల శిక్షణా శిబిరంలో 500మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌ఆర్‌యుసిసి మెంబర్ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి రామకృష్ణారెడ్డి, బిజేవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, రంగనాథరెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.
రూరల్ అధ్యక్షునిగా రాంబాబు
తాడిపత్రి రూరల్ అధ్యక్షునిగా రాంబాబును జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.