S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 05:15

దర్భంగా, జూలై 30: మంత్రగత్తెగా ముద్రవేసి ఒక దళిత మహిళను చితకబాదడంతో పాటు ఆమె మూత్రాన్ని ఆమెతోనే తాగించిన అమానుష ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. దర్భంగా జిల్లాలోని పిప్రా గ్రామంలో నలుగురు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

07/31/2016 - 05:14

పెషావర్, జూలై 30: పాకిస్తాన్‌లో శనివారం ఆకస్మికంగా ముంచెత్తిన వరదల్లో ఒక వ్యాన్ కొట్టుకుపోయి, అందులో ప్రయాణిస్తున్న 20 మంది మృతి చెందారు. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలో బారానుంచి బజార్ జాఖా ఖేల్‌కు పెళ్లి బృందాన్ని తీసుకొని వెళ్తున్న వ్యాన్ తబాయి ప్రాంతంలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయింది.

07/31/2016 - 05:13

బెంగళూరు, జూలై 30: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు రాకేశ్ శనివారం బెల్జియంలో కన్నుమూశారు. శరీరంలోని అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల రాకేశ్ చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. సిద్దరామయ్య పెద్ద కుమారుడైన రాకేశ్ గత వారం స్నేహితులతో కలిసి ఐరోపా పర్యటనకు వెళ్లారు.

07/31/2016 - 05:11

సియాటిల్, జూలై 30: అమెరికాలో కాల్పుల సంస్కృతి బెంబేలిస్తూనే వుంది. తాజాగా సియాటిల్ నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని నగర పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని హార్బోవ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. కాల్పులకు పాల్పడ్డాడని భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.

07/31/2016 - 05:11

ముంబయి, జూలై 30: సుప్రీం కోర్టు ఆదేశం మేరకు సైనిక దళం దక్షిణ ముంబయిలోని కొలాబాలో ఆదర్శ్ కుంభకోణంతో కళంకితమైన బహుళ అంతస్తుల భవనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. సైనిక సిబ్బందితో కూడిన ఒక బృందం శుక్రవారం వివాదాస్పదమైన ఈ ప్రదేశానికి చేరుకుని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ నుంచి అధికారికంగా ఆ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించింది.

07/31/2016 - 05:10

శ్రీనగర్, జూలై 30: జమ్మూ-కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద శనివారం ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాన్ని సైనిక దళం భగ్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఇద్దరు సైనికులు మృతిచెందారు.

07/31/2016 - 03:52

కింగ్‌స్టన్ (జమైకా), జూలై 30: ఒలింపిక్స్‌లో మూడోసారి ‘ట్రిపుల్’ను సాధించి చరిత్ర సృష్టించడమే తన లక్ష్యమని ‘జమైకా చిరుత’, లెజెండరీ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. ఆ లక్ష్యాన్ని సాధి స్తానని ధీమా వ్యక్తం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలేలోనూ అతను స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు.

07/31/2016 - 03:50

పారిస్, జూలై 30: రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. డోపింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా, తాజాగా వెయిట్‌లిఫ్టర్లు కూడా ఈ జాబితాలో చేరారు. ఫలితంగా మొత్తం వెయిట్‌లిఫ్టింగ్ జట్టుపైనే వేటు పడింది. రష్యా లిఫ్టర్లు పదేపదే డోపింగ్ పరీక్షలో విఫలమవుతున్నారని, అందుకే, ఎనిమిది మంది సభ్యులతో కూడిన మొత్తం జట్టుపై అనర్హత వేటు తప్పలేదని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది.

07/31/2016 - 03:49

రియో డి జెనీరో, జూలై 30: ఒలింపిక్స్‌లో పాల్గొం టున్న భారత అథ్లెట్ల సందడి రియోలో ఆరంభమైంది. భారీ బృందంలోని సభ్యులు జట్లు జట్లుగా రియోలోని ఒలింపిక్ క్రీడా గ్రామానికి చేరి, తమకు కేటాయించిన భవనాల్లో సర్దుకుంటున్నారు. మిగతా వారి విషయం ఎలావున్నా అందరి దృష్టి హాకీ జట్లపై కేంద్రీకృతమైంది. మహిళలు, పురుషుల హాకీ జట్లు రియో చేరుకున్నాయి.

07/31/2016 - 03:47

రియో డి జెనీరో, జూలై 30: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆస్ట్రేలియా బృందం బస చేసిన ఒలింపిక్ విలేజ్‌లోని ఓ భవనం పార్కింగ్ ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనితో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వారిని మరో హోటల్‌కు తరలించారు. బృందంలో వందకుపైగా అథ్లెట్లు, అధికారులు ఉన్నారు.

Pages