S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒలింపిక్ క్రీడా గ్రామంలో భారత అథ్లెట్ల సందడి

రియో డి జెనీరో, జూలై 30: ఒలింపిక్స్‌లో పాల్గొం టున్న భారత అథ్లెట్ల సందడి రియోలో ఆరంభమైంది. భారీ బృందంలోని సభ్యులు జట్లు జట్లుగా రియోలోని ఒలింపిక్ క్రీడా గ్రామానికి చేరి, తమకు కేటాయించిన భవనాల్లో సర్దుకుంటున్నారు. మిగతా వారి విషయం ఎలావున్నా అందరి దృష్టి హాకీ జట్లపై కేంద్రీకృతమైంది. మహిళలు, పురుషుల హాకీ జట్లు రియో చేరుకున్నాయి. పురుషు జట్టు ఈనెల 6న ఐర్లాండ్‌తో, మహిళల జట్టు ఈనెల 7న జపాన్‌తో తమతమ మొదటి మ్యాచ్‌లు ఆడతాయి. గోల్‌కీపర్ శ్రీజేష్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు సుదీర్ఘకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఒలింపిక్ పతకాన్ని సాధించి పెడుతుందో లేదో చూడాలి. ఒకప్పుడు హాకీ ప్రపంచాన్ని శాసించిన భారత్ 8 స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో మొత్తం 11 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. కానీ, క్రమంగా ప్రాభవం కోల్పోయింది. 2008లో మొట్టమొదటిసారి ఒలింపిక్స్‌కు అర్హత కూడా సంపాదించలేకపోయింది. లండన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయినప్పటికీ, చిట్టచివరి స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకుంది. భారత మహిళల జట్టు 36 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ఫిలడేల్ఫియా నుంచి రియో చేరుకున్న మహిళల జట్టు రియోలో చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్నది. ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడమే ఈ జట్టు సాధించిన అద్భుత విజయం. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, అమెరికా, జపాన్ జట్లతో కలిసి ‘బి’ గ్రూపులో ఉన్న ఈ జట్టు సాధించే ప్రతి విజయం ఒక మైలురాయిగా మిగిలిపోతుంది.
2న అధికారిక ఆహ్వానం
రియో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ రెండో తేదీన భారత బృందానికి అధికారికంగా ఆహ్వానం పలుకుతుంది. ఇప్పటికే భారత అథ్లెట్లు క్రీడా గ్రామానికి చేరుకుంటున్నప్పటికీ, నిబంధనల ప్రకారం ఒక్కో దేశానికి ఒక్కో నిర్దిష్టమైన సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలోనే అధికారికంగా ఆహ్వానం పలుకుతారు. భారత బృందం త్రివర్ణ పతాకంతో దర్శనం ఇస్తుంది.