S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 03:42

లాస్ ఏంజిలిస్, జూలై 30: రష్యా స్విమ్మర్ నికిటా లొబిత్సెవ్‌పై కొత్త ఆంక్షలేవీ లేవని, అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (్ఫనా) ఇప్పటికే అతనిని రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా సస్పెన్షన్ వేటు విధించిందని అమెరికా డోపింగ్ నిరోధక విభాగం (యుఎస్‌ఎడిఎ) స్పష్టం చేసింది. తాజా డోప్ పరీక్షలోనూ లొబిత్సెవ్ విఫలమయ్యాడని తెలిపింది.

07/31/2016 - 03:40

హైదరాబాద్, జూలై 31: ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఆదివారం పుణెరీ పల్టన్‌తో జరిగే మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ కఠిన పరీక్ష ఎదుర్కోక తప్పదు. హోం టౌన్‌లో, వేలాది మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ జరుగుతున్న కారణంగా టైటాన్స్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.

07/31/2016 - 03:39

కింగ్‌స్టన్, జూలై 30: వెస్టిండీస్‌తో శని వారం ఆరంభమైన మొదటి టెస్టు మ్యా చ్ ఆరంభంలోనే టీమిండియా పట్టు బి గించింది. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయన విండీస్ భోజన వి రామ సమయానికి కేవలం 88 పరుగుల కే నాలుగు వికెట్లు కోల్పోయంది. జర్మైన్ బ్లాక్‌వుడ్ ఒక్కటే 62 పరుగులు చేసి, జ ట్టును ఆదుకోవడానికి శ్రమించాడు.

07/31/2016 - 03:39

ప్యూబ్లా, జూలై 30: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అర్జెంటీనా సాకర్ ఆటగాళ్లు బస చేసిన హోటల్ గదుల్లో చోరీ జరిగింది. ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు వీలుగా పలు మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా జట్టు చివరి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెక్సికోను ఢీ కొంది. ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

,
07/31/2016 - 03:39

పల్లేకల్, జూలై 30: రంగన హెరాత్ స్పిన్ మాయాజాలం ఆస్ట్రేలియాపై శ్రీలంకకు 17 సంవత్సరాల తర్వా త చారిత్ర విజయాన్ని సాధించిపెట్టింది. 38 ఏళ్ల హెరాత్ 54 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చి, ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో లంకను 106 పరుగుల తేడాతో గెలిపించాడు. ఆస్ట్రేలియాపై లంకకు ఇది కేవ లం రెండో టెస్టు విజయం కావడం విశేషం. కాగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అర్ధ శతకం సాధించినప్పటికీ జట్టును ఆదుకోలేకపోయాడు.

,
07/31/2016 - 03:39

పల్లేకల్, జూలై 30: రంగన హెరాత్ స్పిన్ మాయాజాలం ఆస్ట్రేలియాపై శ్రీలంకకు 17 సంవత్సరాల తర్వా త చారిత్ర విజయాన్ని సాధించిపెట్టింది. 38 ఏళ్ల హెరాత్ 54 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చి, ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో లంకను 106 పరుగుల తేడాతో గెలిపించాడు. ఆస్ట్రేలియాపై లంకకు ఇది కేవ లం రెండో టెస్టు విజయం కావడం విశేషం. కాగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అర్ధ శతకం సాధించినప్పటికీ జట్టును ఆదుకోలేకపోయాడు.

07/31/2016 - 03:29

విజయవాడ, జూలై 30: అక్రమాలకు పాల్పడుతున్న పదివేల మంది వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసింది చంద్రబాబు సర్కారు. తద్వారా వినియోగదారుల ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టింది. పాలనలో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విధానంలో కూడా ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టింది.

07/31/2016 - 03:27

విశాఖపట్నం/గాజువాక, జూలై 30: విద్యుదుత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఎన్‌పిసిఎల్) థర్మల్ ప్రాజెక్టుకు రైలు, రోడ్డు మార్గాలకు లైన్ క్లియరైంది.

,
07/31/2016 - 03:25

ముంబయి, జూలై 30: ముంబయి లోకల్ రైలు ప్రయాణికులను విలె పార్లే స్టేషన్ రాగానే ఓ కమ్మటి సువాసన పలకరిస్తుంది. పక్కనే ఉన్న పార్లే బిస్కట్ తయారీ కర్మాగారం నుంచే వస్తుంది ఆ పరిమళం. తాజా బిస్కట్లు తింటున్నట్లుండే ఆ మధురానుభూతిని ప్రయాణికులెవరూ మరిపోలేరు. అయితే ఇప్పుడు ఆ అనుభూతి కలగడం లేదు. కారణం.. చారిత్రాత్మక ఈ పార్లే బిస్కట్ల కర్మాగారం మూతబడింది కనుక. అవును..

07/31/2016 - 03:21

అనంతపురం, జూలై 30: అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందబోతోంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా నిత్యం కరవు కాటకాలకు నిలయమైన, రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన అనంత పురం జిల్లా పురోభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాకు 19 భారీ, మధ్యతరహా పరిశ్రమలు మంజూరయ్యాయి.

Pages