S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 06:24

నెల్లూరు, జూలై 30: నెల్లూరు జిల్లా ఆడిట్ అధికారి లంచం తీసుకుంటూ శనివారం ఏసిబి అధికారుల చేతికి చిక్కాడు. నెల్లూరు జిల్లా ఆడిట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న బూడిద వెంకసుబ్బయ్య మృతిచెందడంతో అతని భార్యకు పింఛను వచ్చేది. ఆమె కూడా ఇటీవల మృతిచెందడంతో అవివాహిత అయిన ఆమె కుమార్తెకు ఆ పింఛన్ మంజూరు చేయాలని వెంకటసుబ్బయ్య కుమారుడు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశాడు.

07/31/2016 - 06:23

విజయవాడ, జూలై 30: రాజధాని అమరావతి నగర పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించిన భూ సమీకరణ పథకం (ఎల్పీఎస్) లేఅవుట్ల ముసాయిదా ప్రకటనను ఏపి సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ శనివారం నాడిక్కడ విడుదల చేశారు. వీటిని ఆయా పంచాయతీ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పత్రికా ముఖంగానూ, గుంటూరు జిల్లా, ఏపి సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లోనూ ప్రకటించడం జరిగింది.

07/31/2016 - 06:15

రాపూరు, జూలై 30: అన్నీ తానై ఓ కన్నతల్లికి కొడుకు లేని లోటు తీర్చే విధంగా తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలం పులిగెలపాడు గ్రామంలో శనివారం జరిగింది. రాపూరు ఆర్‌టిసి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న అంకమ్మ (36) తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతిచెందింది. అయితే ఈమెకు కొడుకులు లేరు. ఒక కుమార్తె మాత్రమే ఉంది.

07/31/2016 - 06:14

సింహాచలం, జూలై 30: దేవాలయాల్లోని అర్చకులు, పురోహితులుగా విధులు నిర్వహిస్తున్న వారికి బయోమెట్రిక్ విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత బ్రాహ్మణ సంఘ సమాఖ్య పేర్కొంది.

07/31/2016 - 06:02

ఉప్పల్, జూలై 30: ఇంట్లో నల్లా కనెక్షన్ ఉందా.. అయితే ఇక నుంచి మీటరు తప్పని సరి బిగించుకోవాల్సిందే. పది రోజుల్లో పెట్టుకోకపోతే ప్రస్తుతం వస్తున్న బిల్లులో డబుల్ చెల్లించాల్సిందేనని జల మండలి హెచ్చరికలు జారీ చేసింది. రెండు నెలల గడువు దాటితే నల్లా కనెక్షన్ కట్ చేసేందుకు నీటి వినియోగదారులకు రెడ్ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

07/31/2016 - 06:00

శ్రీశైలం ప్రాజెక్టు, జూలై 30: నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో దోమలపెంట సమీపంలో శనివారం రాత్రి కారు బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు చెందిన ఒక కుటుంబం శ్రీశైలం మల్లన్న దర్శనానికి కారు (ఎ09బిఎక్స్ 8287)లో బయలుదేరారు.

07/31/2016 - 05:59

హైదరాబాద్, చార్మినార్, జూలై 30: ఆషాడమాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల జాతరలో భాగంగా ఆదివారం జరగనున్న పాతబస్తీ బోనాలకు సర్వం సిద్ధమైంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే సౌత్‌జోన్‌లోని దాదాపు అన్ని దేవాలయాల వద్ధ భక్తులకు వౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయి.

07/31/2016 - 05:58

హైదరాబాద్, జూలై 30: మహానగర పాలక సంస్థ పేరుకే గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది. బతికున్నపుడు ఏళ్ల తరబడి సేవ చేసినా, ఇవ్వాల్సిన ప్రమోషన్ ఇవ్వని అధికారులు చనిపోయిన తర్వాత పదోన్నతి కల్పించటం గమనార్హం.

07/31/2016 - 05:57

హైదరాబాద్, జూలై 30: వర్షాకాలం ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారిన నగరంలోని శిథిల భవనాల కూల్చివేత పనులు శనివారం కూడా కొనసాగాయి.

07/31/2016 - 05:56

జాన్‌పూర్(యుపి), జూలై 30: ఉత్తరప్రదేశ్‌లో 2005లో జరిగిన శ్రమజీవి ఎఖ్సప్రెస్ పేలుడులో బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహార్ అల్ ఇస్లామీ(హుజి)కి చెందిన ఉగ్రవాది ఒకరికి మరణ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు శనివారం తీర్పు చెప్పింది. బంగ్లాదేశ్‌కు చెందిన అలంగీర్ అలియాస్ రోనీకి మరణ విక్షతో పాటు 7 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బుద్ధిరామ్ యాదవ్ తీర్పు చెప్పారు.

Pages