S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 03:05

అస్సాం: ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాలు వరదలతో విలవిల్లాడుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపానికి ఈశాన్యరాష్ట్రం అస్సాం పూర్తిగా మునిగిపోయింది. ఇప్పటి వరకు దాదాపు 34మంది మరణించారు. అటు పశ్చిమబెంగాల్‌లో 31గ్రామాలు

,
07/31/2016 - 03:02

గౌహతి/ మాల్దా/ ముంబయి, జూలై 30: భారీ వర్షాలు అస్సోం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న అసోంలో మృతుల సంఖ్య 34కు పెరిగింది. కజిరంగా జాతీయ పార్కులో దాదాపు 80 శాతం నీట మునిగింది. 22 జిల్లాల్లోని సుమారు 19 లక్షల మంది వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన అసోంను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సందర్శించారు.

07/31/2016 - 02:59

వాషింగ్టన్, జూలై 30: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నామినీ అయిన డొనాల్ట్ ట్రంప్ ఉద్యోగాలు, పన్నులు, జాతీయ భద్రత అంశాలపై తన డెమోక్రటిక్ పార్టీ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ వ్యూహాలను ఎండగట్టారు. నిలకడయిన నాయకత్వాన్ని అందిస్తానని హిల్లరీ క్లింటన్ పార్టీ కనె్వన్షన్‌లో హామీ ఇచ్చిన ఒక రోజు తర్వాత ట్రంప్ తాజా వీడియోలో ఆమె విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు.

07/31/2016 - 02:42

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీపై డిజిపి అనురాగ్ శర్మ సిఎం కెసిఆర్‌ను శనివారం కలిసి పరిస్థితి వివరించారు. శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఎంసెట్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం తరువాత నిర్వహించిన ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడాన్ని ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా భావిస్తున్నారు.

07/31/2016 - 02:41

న్యూఢిల్లీ, జూలై 30: నాటి కాకతీయుల రాజధాని వరంగల్లు దేశంలోనే అత్యుత్తమ వారసత్వ నగరంగా ఎంపికైంది. కేంద్ర పర్యాటక శాఖ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులలో వారసత్వ నగరం విభాగంలో వరంగల్లుకు పురస్కారం దక్కింది. దాదాపు పదకొండు వందల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అపూర్వ కాకతీయ వారసత్వ సంపద అయిన శిల్పకళ, నాట్యకళ, నిర్మాణకళ ఇవాల్టికీ చెక్కుచెదరకుండా నిలబడటం వల్లనే ఈ జాతీయ గుర్తింపు లభించింది.

07/31/2016 - 02:39

హైదరాబాద్, జులై 30: మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాలను సందర్శించేందుకు కోర్టు అనుమతించడంతో సోమవారం యాత్ర నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. మల్లన్న సాగర్‌ను సందర్శించేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడిలను కోర్టు అనుమతించడం తెలిసిందే. ఈమేరకు శనివారం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వారితో చర్చించారు.

,
07/31/2016 - 02:38

హైదరాబాద్/ ఘట్‌కేసర్, జూలై 30: ఐదుగురు సభ్యుల కుటుంబం ఒకేరోజు అంతమైపోయంది. గుండెపోటుతో ఇంటి యజమాని మృతి చెందితే, భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య, తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఇద్దరు కుమార్తెలు, కుమారుడు క్షణికావేశంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలోని ఐదుగురూ మృతిచెందటం స్థానికులను కలచివేసింది.

07/31/2016 - 02:33

హైదరాబాద్, జూలై 30: గనుల శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది. లైసెన్స్ తీసుకొని మైనింగ్ చేపట్టని సంస్థలకు నోటీసులు జారీ చేసి లైసెన్స్ రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మేజర్ మినరల్స్‌లో 84 వర్కింగ్, 51 నాన్ వర్కింగ్ మొత్తం 135 గనులు ఉన్నాయి. మైనర్ మినరల్స్‌లో 1867 వర్కింగ్, 909 నాన్ వర్కింగ్ మొత్తం 2776 గనులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

07/31/2016 - 02:31

హైదరాబాద్, జూలై 30 : గోదావరి అంత్యపుష్కరాలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 11 వరకు ఇవి జరుగుతాయి. అయితే ఈ సందర్భంగా వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే విషయమై అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఉన్న స్నాన ఘట్టాలనే ఎలాంటి మరమ్మతులు లేకుండా ఉపయోగిస్తున్నాయి.

07/31/2016 - 02:29

హైదరాబాద్, జూలై 30: గ్లోబల్ వార్మింగ్ పుణ్యమాని మహానగరంలో విచిత్ర వాతావరణం నెలకొంది. తెల్లవారుఝాము చిరుజల్లులు, చల్లటి గాలులతో ప్రారంభమవుతున్న వాతావరణం మధ్యాహ్నం ఓ మోస్తరు ఎండకొట్టి, తర్వాత ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమవుతుంది. చిరుజల్లులతో మొదలై జడివాన దంచికొడుతోంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదార్లు జలమయమయ్యాయి.

Pages