S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సభ్యత

వ్యక్తిత్వ వికాసమిచ్చే
సౌందర్య జీవనశైలి సభ్యత
సామాజిక జీవనానికి స్వేచ్ఛా వారధి
సభ్యత మధుర ఫలాల మహావృక్షం
విశ్వమానవాళి సేదతీర్చే విశాల హృదయం
సభ్యత జీవన పయనంలో
ముందుకు నడిపే రాస్తాగా మలుపుతిప్పే చౌరస్తాగా
పడినా లేపి నిచ్చెనేసి నింగికి ఎగదోస్తుంది
సభ్యత నిరంతర చైతన్య జీవవాహిని
ఉద్రేకం ఉన్మాదాల మురికి కడిగేస్తుంది
మానవత్వ రథ సారధికి హారతి పడుతుంది
నీ కలం దేహంలోంచి రాలిపడిన నెత్తుటి చుక్క
అమ్మ నుదుటి సింధూరమై మాతృస్పర్శకు పులకిస్తే
నా సమూహంలో సభ్యత స్వరూపం సాక్షాత్కరించినట్టే
నా కొడుకు నన్ను నేను నాన్నను ఆత్మీయంగా ఆదరిస్తే
నాన్న వాళ్ల నాన్నకు ఆప్యాయత పరిమళాల నద్దితే
నా వంశ క్షేత్రంలో సంస్కార బీజాలు మొలకెత్తినట్టే
నలుగురిలో నమస్కార సంస్కారం చిగురిస్తే
నా సమాజంలో సభ్యత విరులు వికసించినట్టే.

-నాశబోయిన నరసింహం 9542236764