S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 03:26

శ్రీకాకుళం(టౌన్), జూలై 29: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారత సంచార నిగమ్ లిమిటెడ్ సిగ్నల్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, సిగ్నల్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి మనోజ్‌సిన్హాను శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహననాయుడు కోరారు.

07/30/2016 - 03:26

శ్రీకాకుళం(టౌన్), జూలై 29: జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో ‘వనం-మనం’ కార్యక్రమం ఉప్పెనలా సాగింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు విద్యాసంస్థలు, వైద్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయా విభాగాధిపతులు చేపట్టారు.

07/30/2016 - 03:25

శ్రీకాకుళం(టౌన్), జూలై 29: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో నిర్వహిస్తున్న వనం-మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

07/30/2016 - 03:25

జలుమూరు, జూలై 29: సృష్టికి మూలం చెట్లని అవి ఉంటే మనిషి జీవనం సాగుతుందని కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్టస్థ్రాయిలో వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి మండలం రాణ పంచాయతీ మెళియాపుట్టి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ శాంతిపార్థవ అధ్యక్షతన జరిగిన వనమహోత్సవ కార్యకమంలో పాల్గొని మాట్లాడారు.

07/30/2016 - 03:24

శ్రీకాకుళం, జూలై 29: ప్రపంచదేశాల్లో భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఓ ప్రత్యేకత స్థానం ఉంది. వేదాలు నుంచి వైఫే వరకూ వచ్చిన సాంకేతిక మార్పుల్లో సైతం మనదేశం ‘మేము సైతం’ అంటూ ప్రపంచదేశాలతో పోటీపడుతూ ఇక్కడ సంతతి సాఫ్ట్‌వేర్ కంపెనీలను శాసించే స్థాయికి ఎదిగింది.

07/30/2016 - 03:24

శ్రీకాకుళం(టౌన్), జూలై 29: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో శుక్రవారం బ్యాంకు సిబ్బంది ఒకరోజు సమ్మె చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు వందకోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. కాగా బ్యాంకు యూనియన్లు ఎన్‌సిబిఇ, ఎఐబిఇఎ, బిఇఎఫ్‌ఐ, ఎస్‌బిఐఓఎ, ఎఐబివోసి, ఎఐబివోఎ, తదితర సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి.

07/30/2016 - 03:24

కొత్తూరు, జూలై 29: నిరుపేద బడుగు, బలహీన వర్గాలకు రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందించాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొత్తూరులో ప్రజాపంపిణీ బియ్యం నేరుగా అక్రమ రవాణా జరుగుతోంది. స్థానిక ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ఓ రైస్‌మిల్లుకు లారీలో అక్రమంగా 50 బస్తాల బియ్యం తరలిస్తుండగా కొత్తూరుకు చెందిన కొందరు యువకులు పట్టుకొని సంబంధిత సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.

07/30/2016 - 03:23

కోటబొమ్మాళి, జూలై 29: 2029 నాటికి జిల్లా 50 శాతం పచ్చదనంతో హరిత శ్రీకాకుళంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక వ్యవసాయమార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ హరితాంధ్రలో భాగంగా వనం-మనం కింద కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు.

07/30/2016 - 03:22

శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో వివాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నేతల మధ్య వ్యక్తిగత వైరం.. కేడర్‌పై ప్రభావితం చూపిస్తోంది! కంచుకోటలా ఉండాల్సిన సిక్కోల్ టిడిపి మంచుకోటలా కరిగిపోతోంది! ముఖ్యంగా వర్గాలు.. వైషమ్యాలు పార్టీ సంస్థాగత నిర్ణయాలను తల్లకిందులు చేస్తున్నాయి. జిల్లా మంత్రి అవునంటే - ప్రభత్వ విప్ కాదని. .వారి మధ్యలో అవును-కాదంటూ జిల్లా పార్టీ అధ్యక్షురాలు...

07/30/2016 - 03:21

దర్శి,జూలై 29: రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు.శుక్రవారం 67వ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా వనం -మనం కార్యక్రమాన్ని దర్శి ప్రభుత్వజూనియర్ కాలేజి ఆవరణలో మొక్కలునాటే కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

Pages