S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 03:46

సింహాచలం, జూలై 29 : రాష్ట్రంలోని దేవాదాయ, దేవాలయాలకు చెందిన భూములను హరిత వనాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ వై.వి. అనురాధ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వనం- మనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కృష్ణాపురం ఉద్యాన వనం (గోశాల)లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు.

07/30/2016 - 03:46

అరకులోయ, జూలై 29: ప్రతి పౌరుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కోరారు. మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

07/30/2016 - 03:45

హైదరాబాద్, జూలై 29: ఎమ్సెట్-2 లీకేజిపై అధికారులు, న్యాయ నిపుణులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాలుగు గంటల పాటు తర్జన భర్జనలు జరిపిన అనంతరం ఎట్టకేలకు రద్దు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఎమ్సెట్-2 రద్దుపై అధికారికంగా సోమవారం ప్రకటన చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

07/30/2016 - 03:45

పాడేరు, జూలై 29: విశాఖ మన్యాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. 67వ వన మహోత్సవం సందర్భంగా స్థానిక గురుకుల బాలికల కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన వనం మనం కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం అందరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు.

07/30/2016 - 03:45

చోడవరం, జూలై 29: మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యతను ప్రతీ ఒక్కరూ చేపట్టాలని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. మండలంలో వనం- మనం కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే మండలంలోని వివిధ గ్రామాల్లో 14వేల 380 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఖండిపల్లి గ్రామంలో మొక్కలు నాటి వనం-మనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

07/30/2016 - 03:44

కశింకోట, జూలై 29: వనం- మనం కార్యక్రమంను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ తెలిపారు. స్థానిక శ్రీకోదండసీతారామ దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం వనం-మనం కార్యక్రమం ను ఎమ్మెల్యే అట్టహాసంగా ప్రారంభించారు.

07/30/2016 - 03:43

పరవాడ, జూలై 29: ముత్యాలమ్మపా లెం సముద్ర తీరాన్ని పర్యాటకం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం వసుధ ఫార్మా కెమ్ ఔషధ కంపెనీలో ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు.

07/30/2016 - 03:43

సీలేరు, జూలై 29: మావోయిస్టులు పిఎల్‌జిఎ వారోత్సవాలు కటాఫ్ ఏరియాల్లో స్థూపాలను ఆవిష్కరించి అమరవీరులకు ఘనంగా నివాళ్ళులర్పిస్తున్నారు.

07/30/2016 - 03:42

నర్సీపట్నం(టౌన్), జూలై 29: గొలుగొండ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుండి రాత్రి వరకు సోదాలు చేశారు. కళాశాలలో వసతులు, ఆహార పదార్ధాలు, డార్మెంటరీ, తరగతుల నిర్వహణ తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు ఎసిబి బృందం ఇక్కడకు వచ్చారు.

07/30/2016 - 03:40

విజయవాడ, జూలై 29: వ్యవసాయదారుడు తను పండించిన ఉత్పత్తులకు తానే ధర నిర్ణయించుకునే రోజు తీసుకువస్తామని, ఇందులో భాగంగా ఆగస్టు ఆరవ తేదీన అనంతపురంలో రైతు ఉత్పత్తి సంఘాలను (ఎఫ్‌పిఓ) ప్రారంభించనున్నట్టు చంద్రబాబు తెలియచేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి 5,400 వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages