S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంత్రుల మధ్య చిచ్చు

హైదరాబాద్, జూలై 29: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం రెండు శాఖల మంత్రుల మధ్య చిచ్చురేపుతోంది. విద్యాశాఖ-వైద్య శాఖ మంత్రుల మధ్య అగాధం ఏర్పడింది. వాస్తవంగా ఎంసెట్ తేదీ ఖరారు, పరీక్షల నిర్వహణ, పరీక్షా పేపర్లను డ్రా విధానంలో తీయడం, ఎమ్సెట్ ఫలితాల వెల్లడి తదితర అంశాలన్నీ ఉన్నత విద్యాశాఖ పరిధిలో కొనసాగాలని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంటే ఈ శాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరగాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఈ కార్యక్రమాలను వైద్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి స్వయంగా నిర్వహించారు. ఎమ్సెట్‌కు సంబంధించి ఏ అంశం చర్చించాలనుకున్నా వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఎమ్సెట్ కన్వీనర్లతో మంత్రి లక్ష్మారెడ్డి స్వయంగా చర్చించి నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. ఎంసెట్-1, ఎంసెట్-2, నీట్-1, నీట్-2 అంశాలపై అధికారులతో చర్చించడమే కాకుండా మీడియాతో కూడా ఆయనే మాట్లాడుతూ వస్తున్నారు. ఎమ్సెట్ పరీక్షల సందర్భంగా మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి ఎమ్సెట్ కన్వీనర్ నాయకత్వం వహించగా, వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి, జెఎన్‌టియు వైస్-చాన్సలర్, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి శివధర్‌రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా లక్ష్మారెడ్డి నేతృత్వంలోనే సాగింది.
ఈ కార్యక్రమాలన్నీ ఉన్నత విద్యా మంత్రి నేతృత్వంలో జరగాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. ఎమ్సెట్ ఫలితాల తర్వాత మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కార్యక్రమం తర్వాత వైద్య శాఖ పరిధిలోకి వస్తుందని ఆ అధికారి వివరించారు. ఇందుకు విరుద్ధంగా లక్ష్మారెడ్డి చొరవ తీసుకోవడం వల్ల ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఆగ్రహం కలిగిందని తెలుస్తోంది. ఈ పరిస్థితిలోనే ఎమ్సెట్ బాధ్యతను కడియం తీసుకోవడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి వద్ద ఈ అంశాన్ని కడియం ప్రస్తావించినట్టు తెలిసింది. మొత్తం మీద ఎమ్సెట్ వ్యవహారం కడియం శ్రీహరి-లక్ష్మారెడ్డిల మధ్య చిచ్చుకు తెరలేపిందని స్పష్టమవుతోంది.