S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కర్నూలులో దొరికిన ఇద్దరు లీక్‌వీరులు

కర్నూలు, జూలై 29: తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరిని సిఐడి అధికారులు శుక్రవారం కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న సూరజ్ గ్రాండ్ హోటల్‌లో బసచేసిన వెంకటరమణ, తరుణ్‌ను శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరిద్దరూ కర్నూలులో ఉన్నట్లు పసిగట్టిన సిఐడి అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో దాడి జరిపి, అదుపులోకి తీసుకున్నారు.
ఎంసెట్-2 లీకేజీ ప్రధాన సూత్రధారులు రాజ్‌గోపాల్‌రెడ్డి, రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న వెంకటరమణ, తరుణ్‌కోసం సిఐడి అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు. వీరి సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా విచారణ ప్రారంభించగా సిమ్‌లు మార్చినట్లు గుర్తించారు. దీంతో వీరి కుటుంబసభ్యులను విచారించగా కొత్త సిమ్‌లు వాడుతున్నట్లు తెలుసుకున్నారు. వారి నుంచి కొత్త నెంబర్లు తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ల సాయంతో కూపీ లాగగా వీరిద్దరూ కర్నూలు నగరంలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సిమ్ నంబర్ల సిగ్నల్స్ గత 24 గంటల నుంచి ఒకే సెల్‌టవర్ నుంచి వస్తున్నట్లు గుర్తించి ఏదైనా హోటల్‌లో తలదాచుకుని ఉంటారని అనుమానించారు. దీంతో కర్నూలు పోలీసుల సహకారంతో బళ్లారి చౌరస్తాలో ఉన్న సూరజ్ గ్రాండ్ హోటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం తనిఖీ చేయగా ఒక గదిలో వెంకటరమణ, తరుణ్ కనిపించారు. వారిద్దరీ అదుపులోకి తీసుకుని సాయంత్రం వరకు విచారించారు. రెండు రోజులుగా హోటల్‌లోని సిసి కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సిఐడి అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా రెండు రోజుల క్రితం వెంకటరమణ, తరుణ్ హోటల్‌లో దిగినట్లు సిబ్బంది తెలిపారు. అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారని, హోటల్‌లో ఉన్న క్యాంటీన్‌లోనే భోజనం చేసేవారని చెప్పారు. గుర్తింపు కోసం ఒకరు డ్రైవింగ్ లైసెన్స్, మరొకరు ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీ ఇచ్చినట్లు తెలిపారు. కర్నూలుకు రాక ముందు వీరిద్దరూ చెన్నైలో తలదాచుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లీకు వీరులు బస చేసిన
కర్నూలులోని లాడ్జింగ్