S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 03:04

నంద్యాల, జూలై 29: నంద్యాలలో వైకాపాకి పూర్వ వైభవం తెస్తానని, కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలుస్తానని నంద్యాల వైపిసి ఇన్‌చార్జి రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆగస్టు 4వ తేదీ నుండి గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని మండలంలోని కొత్తపల్లె గ్రామం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

07/30/2016 - 03:03

పత్తికొండ, జూలై 29: సమాజ రక్షణకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం పత్తికొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు.

07/30/2016 - 03:03

బనగానపల్లె, జూలై 29:విద్యార్థుల వేళలకు అనుకూలంగా బస్సు సర్వీసులు నడపాలని ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి ఆర్టీసీ డిఎం శశిభూషణ్‌ను ఆదేశించారు. అప్పలాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు గురువారం ఎమ్మెల్యే బిసి కార్యాలయం వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే బిసి ఆర్టీసీ డిఎంతో కలిసి అప్పలాపురం గ్రామానికి వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.

07/30/2016 - 03:02

ఆత్మకూరు, జూలై 29:మండల పరిధిలోని నల్లకాలువ గ్రామంలో ఇంటి గోడ కూలి 5 నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నల్లకాలువకు చెందిన ప్రేమ్‌కూమార్, ప్రేమజ్యోతి దంపతులకు అనురాధ(5నెలలు) కుమార్తె ఉంది. వారు రేకుల షెడ్‌లో జీవించేవారు. సాయంత్రం మంచానికి ఊయల కట్టి అందులో చిన్నారని పడుకోబెట్టారు. అయితే ఉన్నఫళంగా పక్కనే ఉన్న ఇంటి గోడ కూలి వీరి రేకులషెడ్‌పై పడింది.

07/30/2016 - 03:01

ఖమ్మం, జూలై 29: ఎంసెట్ మెడికల్ పరీక్షాపత్రం లీకేజి వ్యవహారంపై ఖమ్మం జిల్లా వ్యక్తుల పాత్ర కీలకమని తేలడంతో సిబి సిఐడి అధికారులు శుక్రవారం ఖమ్మంలో విచారణ చేపట్టారు. ప్రముఖ కార్పొరేట్ కళాశాల అధినేత కూతురుకు వందలోపు ర్యాంకు రావడం, లీకేజిలో వారిపాత్ర ఉన్నదనే ఆరోపణలు వచ్చాయనే కారణంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.

07/30/2016 - 03:00

భద్రాచలం, జూలై 29: ఈనెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరిగే గోదావరి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐటిడిఎ పీవో, ఇంఛార్జ్ సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఐటీడీఏలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముద్రించిన అంత్య పుష్కరాలు-2016 శుభ ఆహ్వాన గోడ పత్రికలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

07/30/2016 - 03:00

ఖమ్మం (కల్చరల్), జూలై 29: రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి జరిగిందంటే అది కమ్యూనిస్టుల వల్లేనని ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై శుక్రవారం ఖమ్మంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ మొదలుకొని నేడు జిల్లాలో శంకుస్ధాపనలు చేసిన ప్రాజెక్టుల వరకు కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే సాధించుకున్నామని గుర్తు చేశారు.

07/30/2016 - 02:59

భద్రాచలం, జూలై 29: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు దండకారణ్యంలో ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలను భద్రతా బలగాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. వారి ఆధిపత్యానికి చెక్ పెడుతున్నాయి. ఇరు వర్గాలు దూసుకువస్తుండటంతో తీవ్ర అలజడి మొదలైంది.

07/30/2016 - 02:59

మణుగూరు, జూలై 29: ప్రజల సహకారంతోనే హరితహారం కార్యక్రమం విజయవంతమైందని, ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి సంరక్షించాలన్న ఆకాంక్ష మొదలైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా సింగరేణి సంస్థ శుక్రవారం మణుగూరులో ఏర్పాటు చేసిన హరితహారంలో పాల్గొన్న ఆయన మొక్కలు నాటారు.

07/30/2016 - 02:58

ఖమ్మం(జమ్మిబండ), జూలై 29: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగాల రవికుమార్ శుక్రవారం ఖమ్మంలో జనదీక్షను చేపట్టారు. దీక్షను సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వాలు గాలికొదిలేశాయన్నారు.

Pages