S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమాజ రక్షణకు మొక్కలు నాటాలి

పత్తికొండ, జూలై 29: సమాజ రక్షణకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం పత్తికొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పత్తికొండ, గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపాల్ మహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెయి మాట్లాడుతూ సమాజాన్ని రక్షించుకునుటకు మొక్క లు నాటి వాటిని చెట్లుగా ఎదిగేంత వరకు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వనం, మనం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోటి మొక్కలను నాటాలని ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. సిఎం పట్టుబట్టారంటే సాధించే వరకు వదిలి పెట్టరన్నారు. చెట్లు ప్రయోజనాలు అనేకం ఉన్నాయని, ఒక చెట్టు ద్వారా 10 మందికి గాలి లభిస్తుందన్నారు. ప్రతి ఇంటిలో జియో ట్యాపింగ్ విధానం ద్వారా పండ్ల మొక్కలను పెంచాలని ఆలోచనలో సిఎం ఈ పద్ధతిని అమలు చేయనున్నారన్నారు. పట్టిసీమ విజయవంతం కావడంతో చంద్రబాబు రాజధాని నిర్మాణంపై దృష్టి కేంద్రికరించారన్నారు. విద్యార్థినులు ఉన్నత చదువులు చదవాలని కోరారు. ఐఎఎస్, ఐపిఎస్, డాక్టర్ చదువులు చది తల్లిదండ్రులకు, పత్తికొండకు పేరు తేవాలని కోరారు.మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం, సత్యం నాదేళ్ల వంటి ఆదర్శవంతుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 75 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని, ఏ చిన్న సమస్య వచ్చిన రెవెన్యూ శాఖను విమర్శించడం తగదన్నారు. రాత్రి 12 గంటలకు రెవెన్యూ యంత్రాంగం పని చేస్తూ ఉంటుందన్నారు. జిల్లాలో మరుకొన్ని పరిశ్రమలు ఆగస్టు 17వ తేదీ ప్రకటిస్తానమన్నారు. ఉర్దూ యూనివర్శిటీ శంకుస్థాపన చేయడం జరిగిందని, అలాగే ఓర్వకల్లును పరిశ్రమల హబ్‌గా చేస్తామని, నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రసిద్ధి చెందిన అంబుజా కంపెనివారిచే మొక్క జొన్న ఫ్యాక్టరీ, ఫుడ్ ప్రాససింగ్ ఫ్యాక్టరీతోపాటు మెగా సీడ్ పార్కును కర్నూలుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి రామస్వామి, ఆర్డీఓ ఓబులేసు, జడ్పీటీసీ పురుషోత్తంచౌదరి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఎస్‌ఇ ప్రతాప్‌రెడ్డి, ఎంపిపి వరలక్ష్మీ, ధనంజయగౌడ్, పారా రామన్న, పురుషోత్తంచౌదరి, మనోహర్‌చౌదరి, తిరుపాల్, అశోక్‌కుమార్, నరసింహులు, డిఎస్పీ బాబా ఫకృద్దీన్, పత్తికొండ సిఐ విక్రమ్ సింహ, తహశీల్దార్ పుల్లయ్య, ఎంపిడిఓ, ఎపిఓ, మండల స్థాయి అధికారులు, పలు గ్రామల సర్పంచులు, ఎంపిటిసిలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.