S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 02:45

పూతలపట్టు, జూలై 29: మండలంలోని గొడుగుచింత ఎస్టీకాలనీలో గురువారం రాత్రి పిడుగుపడి ఇంటిలోని గృహోపకరణాలు ధ్వంసమైనట్లు బాధితురాలు పార్వతమ్మ తెలిపారు. రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందన్నారు. ఉన్నట్టుండి ఇంటి సమీపంలో పిడుగు పడిందన్నారు. దీంతో ఇక్కసారిగా ఇంటికి నిప్పంటుకొని ఇంటిలోని ఫ్యాన్‌లు, టివి, బీరువా తదితర సామాగ్రి కాలిపోయాయన్నారు.

07/30/2016 - 02:44

తిరుపతి, జూలై 29: స్విమ్స్‌లో రూ.7.4 కోట్లతో కొనుగోలుచేసిన నూతన రేడియేషన్ అంకాలజీవార్డు, మెడికల్ అంకాలజీ వార్డు బ్రాకీ థెరఫీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అంకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జన్‌కు సంబంధించిన పలు అధునాతన వైద్య పరికరాలను శుక్రవారం టిటిడి చైర్మన్ , ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు ప్రారంభించారు.

07/30/2016 - 02:44

తిరుపతి, జూలై 29: కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు ముక్తకంఠంతో ప్రత్యేకహోదా కావాలని రాజ్యసభలో గళం విప్పినా కేంద్ర ప్రభుత్వం మాత్రం నీళ్లుచల్లిందని, ఇందుకు బాబు కపట రాజకీయాలే కారణమని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రామచంద్రయ్య అన్నారు.

07/30/2016 - 02:41

కడప,జూలై 29: జిల్లాలో అనేక మండలాల్లో భారీ వర్షాలు కురవగా చెన్నూరు, బద్వేలు, మైదుకూరు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 10.30గంటల వరకు భారీ వర్షం కురవడంతో వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీని కారణంగా కుందూ, పాపాగ్ని, పెన్నా నదులకు భారీగా వర్షంనీరు చేరడంతో పెన్నానదిలో 5వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూ దిగువనున్న సోమశిల ప్రాజెక్టులోకి చేరుతోంది.

07/30/2016 - 02:40

కడప,జూలై 29: ప్రభుత్వ వైద్యులు, వైద్యసిబ్బంది సక్రమంగా హాజరుకావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆయన జిల్లా పర్యటన సందర్భంగా పెండ్లిమర్రిలో రూ.కోటి 18లక్షలతో నిర్మించిన ప్రాథమిక వైద్యశాలను ప్రారంభించారు.

07/30/2016 - 02:39

కడప,జూలై 29: జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం జిల్లాపర్యటన సందర్భంగా నగరంలో కలియతిరిగారు. కడప జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి 92.6మి.మీ.వర్షం కురవడంతో రవీంద్రనగర్, పాతబస్టాండు, గుంతబజార్, మృత్యుంజయకుంట, జయనగర్ కాలనీ, గౌస్‌నగర్, చిన్నచౌకు, బుడగజంగంకాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజిల్లో పారకుండా డ్రైనేజి నీరు, వర్షం నీరు రోడ్లపై పేరుకుపోయింది.

07/30/2016 - 02:39

కడప,జూలై 29: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు హరితాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు నడుంబిగించారని అందులో భాగంగా 67వ వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమం ద్వారా జిల్లాలో కోటి మొక్కలు పైబడి నాటి రాష్ట్రంలోనే జిల్లాను రోల్డ్‌మోడల్‌గా నిలపాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

07/30/2016 - 02:36

రాయచోటి, జూలై 29: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని తెలుగు దేశం పార్టీ రాయచోటి నియోజక వర్గ ఇన్‌చార్జి రమేష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీ వీరభద్రస్వామి దేవాలయ కార్యనిర్వాహణ అధికారిణి మంజుల ఆధ్వర్యంలో నియోజక వర్గ ఇన్‌చార్జి రమేష్ కుమార్ రెడ్డికి ఆలయ అర్బకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు.

07/30/2016 - 02:35

రాయచోటి, జూలై 29: మానవ మనుగడకు మొక్కలే ఆధారమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో చిత్తూరు మార్గంలోని స్ర్తిశక్తి భవనం సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నసీబున్ ఖానమ్, తహసీల్దార్ గుణభూషణ్ రెడ్డిలు హాజరయ్యారు.

07/30/2016 - 02:35

రాజంపేట, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వనం-మనం కార్యక్రమం ద్వారా కోటి మొక్కలు నాటాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని, మనమంతా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేయాలని విప్ మేడా మల్లికార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్ నుండి వనం-మనం ర్యాలీని ప్రారంభించి, డిగ్రీ కళాశాల ఆవరణంలో మొక్కలు నాటారు.

Pages