S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 02:58

ఖమ్మం(జమ్మిబండ), జూలై 29: హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వాటి పూర్తి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఏఎస్పీ సాయికృష్ణ అన్నారు. శుక్రవారం కృష్ణప్రసాద్ పోలీస్ వెల్ఫేర్ స్కూల్ మైదానంలో 550మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు.

07/30/2016 - 02:57

ఖమ్మం(కల్చరల్), జూలై 29: ట్రాక్టర్ డ్రైవర్లకు వేతనాల పెంపుకై ఆగస్టు 1వ తేది తరువాత సమ్మెబాట పట్టనున్నట్లు సిఐటియు ఖమ్మం డివిజన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ తెలిపారు. శుక్రవారం సిఐటియు ఆద్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి సమ్మె నోటీస్‌ను అందజేశారు.

07/30/2016 - 02:57

ముదిగొండ, జూలై 29: తలసీమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వల్లభి యువకులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు, సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సంకల్ప సభ్యురాలు అనిత మాట్లాడుతూ జిల్లాలో తలసీమియా వ్యాధితో అనేక మంది పిల్లలు బాదపడుతున్నారని, వారికి రక్తహీనత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

07/30/2016 - 02:56

మేడికొండూరు, జూలై 29: రాష్ట్రంలో 2029 నాటికి 50 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన వనం- మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పిలుపునిచ్చారు.

07/30/2016 - 02:56

సత్తుపల్లి, జూలై 29: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్-2 లీకేజి వ్యవహారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి రామిశెట్టి మనోహర్‌నాయుడు అన్నారు.

07/30/2016 - 02:54

గుంటూరు, జూలై 29: దేశీయ విత్తనాలే భరత జాతి పునాదులని పలువురు ప్రముఖులు ప్రస్తుతించారు. విజయవాడ హరితభారతి ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దేశీయ విత్తన సంబరాల్లో విత్తన ఉత్పాదకులు ప్రసంగించారు. కర్నాటకకు చెందిన జాతీయ్ బీజ్ మంచ్ నాయకుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తల్లిలాంటిది నేల అని అభివర్ణించారు. ఏ విత్తనాలు నాటితే అవే విత్తనాలనే అందిస్తుందని వివరించారు.

07/30/2016 - 02:53

అమరావతి, జూలై 29: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న అమరావతిలో జీవ వైవిధ్య మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీరు ఎల్ జుంగో డోర్జి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్టు సభ్యులు అమరావతిలో విస్తృతంగా పర్యటించి మ్యూజియం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు.

07/30/2016 - 02:53

తెనాలి, జూలై 29: నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన, జిల్లాలోనే గ్రేడ్-1 మున్సిపాలిటీ, ప్రత్యేకించి ఆంధ్రాప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలి పట్టణం శుక్రవారం తెల్లవారుఝాము నుండి గంట కురిసిన వర్షానికి తడిసిముద్దయింది. వర్షపునీటితో పట్టణంలోని ప్రధాన వీధులు మురుగు, మురుగు నీటితో దుర్గంథం వెదజల్లుతూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశాయి.

07/30/2016 - 02:52

గుంటూరు (కొత్తపేట), జూలై 29: జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పోలీసు కళ్యాణ మండపంతో పాటు కవాతు మైదానంలో సుమారు 500 మొక్కల పెంపకానికి నాంది పలికారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అదనపు ఎస్పీలు రామాంజనేయులు, వై.టీ నాయుడు, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

07/30/2016 - 02:52

విజయపురి సౌత్, జూలై 29: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడికాలువకు శుక్రవారం సాయంత్రం 6వ గేటు ఎత్తి ప్రాజెక్టు సిఇ వీర్రాజు స్విచ్ ఆన్‌చేసి వేద మంత్రాల మధ్య మంచినీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ సిఇ విలేఖర్లతో మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ మంచినీటి అవసరాలకోసం కృష్ణా బోర్డు 11 టిఎంసిల నీటిని కేటాయించిందన్నారు.

Pages