S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 03:20

ఒంగోలు,జూలై 29:జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి దస్త్రాలను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాదు జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, కమిషనర్ కార్తికేయమిశ్రా, ఎపిఐఐసి ఎండి శ్రీ్ధర్‌తో కలిసి పరిశ్రమలు నెలకొల్పే విషయంపై జిల్లాకలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలవారీగా సమీక్షించారు.

07/30/2016 - 03:19

ఒంగోలు,జూలై 29:కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా జిల్లాలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లాలోని బ్యాంకులన్ని శుక్రవారం మూతపడటంతో కోట్లాధిరూపాయల లావాదేవీలు నిలిచిపోవటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం ఎటిఎంల్లో కూడా నగదు లేకపోవటంతో బ్యాంకు ఉద్యోగులసమ్మెతోఖాతాదారులు అవస్థలు వర్ణాణాతీతంగా మారాయనే చెప్పవచ్చు.

07/30/2016 - 03:18

మార్కాపురం, జూలై 29: అధికారుల హడావుడి, నేతల ప్రచారం బాగానే ఉంది. లక్ష్య పూర్వకంగా లక్షల మొక్కలు తెచ్చి ఆర్భాటంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి వనం-మనం పేరుతో నాటారు. అయితే ఈ మొక్కలను పరిరక్షించే బాధ్యత ఎవరిది అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అనేక ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి లక్షల్లో మొక్కలు నాటినప్పటికీ పదుల సంఖ్యలో మాత్రమే రక్షింపబడ్డాయి.

07/30/2016 - 03:14

నెల్లూరు, జూలై 29: రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక విఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం అడవుల విస్తీర్ణతా శాతంలో 10వ స్థానంలో ఉందన్నారు.

07/30/2016 - 03:13

సైదాపురం, జూలై 29: వైకాపా నుండి తాము ప్రధాన పక్షంగా ప్రజల వైపు పోరాడుతున్నామని జడ్పిచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. మండలంలో శుక్రవారం ఆయన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సైదాపురం ఉన్నత పాఠశాల, మండల కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం మర్లపూడి గ్రామంలో జరిగిన గడపగడపకు వైకాపాలో ఆయన పాల్గొన్నారు.

07/30/2016 - 03:13

వేదాయపాళెం, జూలై 29: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక పురమందిరంలో శుక్రవారం జరిగిన యాంటి ర్యాగింగ్ సదస్సును ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్ యాంటీ ర్యాగింగ్‌కు కీలక పాత్ర పోషించాలన్నారు.

07/30/2016 - 03:12

నెల్లూరు రూరల్, జూలై 29: మానవ జాతి మనుగడ సాధించాలంటే మొక్కల పెంపకం అత్యంత ఆవశ్యకమని జిల్లా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు వద్ద కేంద్ర విద్యాలయం ఆవరణలో వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ మొక్కలు నాటారు.

07/30/2016 - 03:12

నెల్లూరు, జూలై 29: జిల్లాలో వచ్చే నెల 14 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బాలల చలనచిత్ర ప్రదర్శనల కార్యక్రమాలను ఎలాంటి అటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లోప్రదర్శనల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

07/30/2016 - 03:11

కావలి, జూలై 29 : మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రాణాలను హరించే దుష్టశక్తులు వస్తున్నాయంటూ కొన్నిరోజులుగా జనం జాగరణ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తీర ప్రాంతంలోని ఒక గ్రామంలో కొన్ని నెలల క్రితం వరుస మరణాలు సంభవిస్తుండగా ఒక సాధువు వచ్చి గ్రామంలో ఒక మహా దుష్టశక్తి ఉందని, దాన్ని తరిమేస్తేనే శాంతి జరుగుతుందని చెప్పగా అతన్ని గ్రామస్థులు హేళన చేసి పంపించేశారు.

07/30/2016 - 03:11

నెల్లూరు, జూలై 29: జిల్లాలో భారీ పరిశ్రమల స్థాపనకు అనేక పారిశ్రామిక సంస్థలు ముందుకు వస్తున్నందున పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థల సేకరణ, వౌలిక సదుపాయాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ ఆదేశించారు.

Pages