S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 02:51

మంగళగిరి, జూలై 29: విత్తన చట్టంలో మార్పులు అవసరమని దేశమంతా ఒకే చట్టం ఉండేవిధంగా కేంద్రప్రభుత్వం చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని మంగళగిరి మండలం నూతక్కిలో ప్రారంభమైన భారతీయ కిసాన్‌సంఘ్ అఖిల భారత కార్యవర్గ సమావేశం అభిప్రాయ పడింది. మూడురోజుల పాటు జరిగే సమావేశాలు శుక్రవారం ప్రారంభ మయ్యాయి. భారతీయ కిసాన్‌సంఘ్ అఖిల భారత అధ్యక్షుడు బసవీగౌడ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

07/30/2016 - 02:51

గుంటూరు (కార్పొరేషన్), జూలై 29: మొక్కలను నాటుడం సామాజిక బాధ్యతగా స్వీకరించి నగరాన్ని పచ్చదనంతో నింపాలని సాంఘిక సంక్షేమ, గిరిజనశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కోటి మొక్కల పంపిణీ, నాటుట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలో సుమారు 30వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

07/30/2016 - 02:50

అమరావతి, జూలై 29: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించి మొక్కలు నాటాలని పెదకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఐదువేల మొక్కలు నాటారు. పర్యావరణ ప్రాముఖ్యత గుర్తించి మొక్కలు నాటాలని విద్యార్థినులచే ప్రతిజ్ఞ చేయించారు.

07/30/2016 - 02:50

సత్తెనపల్లి, జూలై 29: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి నిరుపేదల గెడిసెలను ఉన్నపళంగా పోలీసులను మోహరించి జెసిబితో రెవెన్యూ అధికారులు దగ్గరుండి నిలువ నీడలను కూల్చేస్తుంటే పేదలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విలపించారు. మండల పరిదిలోని గుడిపూడి గ్రామంలో గురువారం ఒక్కసారిగా పోలీసు బలగాలు ఆ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చేరుకొనేసరికి ఏమి జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది.

07/30/2016 - 02:48

తిరుపతి, జూలై 29: మొక్కలు నాటడం కాదు.. వాటిని పరిరక్షించినపుడే సార్థకత, భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. మిషన్ హరితాంధ్రప్రదేశ్ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం హరితవిప్లవంగా సాగింది.

07/30/2016 - 02:48

చిత్తూరు, జూలై 29: రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి. పలుచోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహించగా సోమల, చౌడేపల్లి మండలాల్లో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో ఈ మండలాల్లో పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది.

07/30/2016 - 02:47

తిరుమల: తిరుమలలో గురువారం నుండి కురిసిన భారీ వర్షం ధాటికి రెండవ ఘాట్ రోడ్డులోని పలుచోట్ల మట్టి పెళ్లలు జారిపడ్డాయి. తిరుమలలో గురువారం సాయంత్రం 6.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది.

07/30/2016 - 02:47

పెనుమూరు, జూలై 29: చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో మండలంలోని కలవగుంట ఎన్టీ ఆర్ జలాశయానికి గురువారం రాత్రి భారీ నీరు వచ్చిచేరింది. శుక్రవారం ఉదయం పది గంటలకు జలాశయంలో నీటిమట్టం 109.8ఎంసి ఎఫిటిలకు చేరింది. కలవగుంట సర్పంచ్ ఆమీన్, పెనుమూరు ఎంపిపి హరిబాబునాయుడు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్‌పర్శన్ గీర్వాణి శుక్రవారం ఉదయం 11గంటలకు జలాశయాన్ని సందర్శించారు.

07/30/2016 - 02:47

తిరుమల, జూలై 29: తిరుమల శేషాచలం అడవులు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టిటిడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమం పిలుపుమేరకు శుక్రవారం తిరుమలలోని శ్రీ గంధం వనంలో మొక్కలు నాటడంలో ఉద్యోగులను, శ్రీవారి సేవకులను భాగస్వామ్యంతో మొక్కలు నాటే బృహత్కార్యక్రమాన్ని చేపట్టిందని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు.

07/30/2016 - 02:45

తిరుమల, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు తిరుమలలో కూడా వివిధ ప్రాంతాలతో వనం-మనం కార్యక్రమంలో టిటిడి శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జె ఇ ఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ అవధాని, ఇతర అధ్యాపక, విద్యార్థులతో కూడి మొక్కలను నాటారు. అటు తరువాత పాఠశాల ప్రంగణంలో నిర్వహిస్తున్న 5రోజుల మాదిరి బ్రహ్మోత్సవాల్లో జె ఇ ఓ పాల్గొన్నారు.

Pages