S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 02:34

కడప,జూలై 29: భూగర్భజలాలు పెంపొందించేందుకు, కరవును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని సక్రమంగా అమలుచేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ శుక్రవారం పేర్కొన్నారు. జిల్లాలో 2014-15లో 679 పనులు మంజూరుకాగా రూ.36.9కోట్లతో పనులు పూర్తిచేసి 94లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టిని తొలగించడం జరిగిందన్నారు.

07/30/2016 - 02:34

గాలివీడు, జూలై 29: మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం కురిసిన వర్షం 32.2మిమీగా నమోదైందని సహాయ గణాంకాధికారి కొండయ్య తెలిపారు. తెల్లవారుజాము 4 గంటల నుండి ఏకధాటిగా కురిసిన వర్షానికి ఎగువగొట్టివీడు, గోరాన్‌చెరువు గ్రామాల్లోని చిన్న చిన్నకుంటలు, నిండి వాగులు అలుగు పారుతోంది. ప్రధానంగా అరవీడు గ్రామంలోని పొదలవంక ఉధృతికి కుషావతినదిలోని చెక్‌డ్యాంలలో అలుగులు పారుతున్నాయి.

07/30/2016 - 02:33

రామాపురం, జూలై 29: మానవాళికి మొక్కలే జీవనాధారమని లక్కిరెడ్డిపల్లె మార్కెట్‌యార్డు ఛైర్మన్ మద్దిరేవుల రమేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని హసనాపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, తహశీల్దార్‌లతో కలిసి మొక్కలు నాటారు.

07/30/2016 - 02:33

ప్రొద్దుటూరు రూరల్, జూలై 29: ప్రొద్దుటూరు పట్టణంలోని నాగేంద్రనగర్‌లో కాపురముంటున్న చంద్రశేఖర్‌రెడ్డి (42), తన కుమారుడు, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో సంచలనం రేకెత్తించింది. మృతుడు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు నాగేంద్రనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి 16 సంవత్సరాల క్రితం తన అక్క కూతురుతో వివాహమైంది.

07/30/2016 - 02:31

విజయనగరం, జూలై 29: వాతావరణ కాలుష్యం భారీగా పెరిగిన కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతున్నాయని జిల్లా ఇన్‌చార్జ్జి, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అసవరం ఏర్పడిందని చెప్పారు. పెద్దఎత్తున మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

07/30/2016 - 02:31

విజయనగరం, జూలై 29: జిల్లా కలెక్టర్‌గా వివేక్ యాదవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన ఎంఎం నాయక్‌ను విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఇపిడిసిఎల్ సిఎండిగా బదిలీ చేసిన ప్రభుత్వం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వివేక్ యాదవ్‌ను ప్రమోషన్‌పై విజయనగరం కలెక్టర్‌గా నియమించింది.

07/30/2016 - 02:30

విజయనగరం (్ఫర్టు), జూలై 29: పట్టణంలో వనం-మనంలో భాగంగా శుక్రవారం వనమహోత్సవం ఘనంగా జరిగింది. మున్సిపల్ పాలకవర్గసభ్యులు, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వనమహోత్సవంలో పాల్గొన్నారు. విజ్జీస్టేడియం, మామిడి మార్కెట్‌యార్డులలో జరిగిన వనమహోత్సవంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మొక్కలను నాటారు.

07/30/2016 - 02:30

విజయనగరం (్ఫర్టు), జూలై 29: మున్సిపల్ స్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్‌కు ఐఐటి పౌండేషన్ కోర్సు ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. అత్యంత ఖరీదైన ఈ కోర్సును పేదవిద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మున్సిపల్ స్కూళ్లలో ప్రవేశపెట్టిందన్నారు. కస్పా మున్సిపల్ హైస్కూల్‌లో శుక్రవారం ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రారంభించారు.

07/30/2016 - 02:29

విజయనగరం (్ఫర్టు), జూలై 29: ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే విధానాలకు కేంద్రప్రభుత్వం స్వస్తి చెప్పకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయం సంఘం గౌరవాధ్యక్షుడు, ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కృష్ణంరాజు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు బ్యాంకు ఉద్యోగులు సన్నద్ధం కావాలన్నారు.

07/30/2016 - 02:29

విజయనగరం, జూలై 29: జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తలెత్తుతున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్ కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలు, పరిశ్రమలశాఖ అధికారులతో సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages