S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 07:17

అనంతసాగరం, జూలై 28: జిల్లాకు సాగు, తాగునీటి వరప్రసాదిని అయిన సోమశిల జలాశయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా తాను కృషి చేస్తానని నూతన కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. గురువారం ఆయన జలాశయాన్ని సందర్శించారు. ప్రాజెక్ట్ చైర్మన్ రాపూరు సుందరరామిరెడ్డి చేతులమీదుగా పుష్పగుచ్ఛాన్ని అందుకున్నారు. అనంతరం జలాశయం వద్ద పరివాహక ప్రాంతాలను పరిశీలించారు.

07/29/2016 - 07:14

నెల్లూరు, జూలై 28: వ్యాధుల కాలం.. రోగాలు ముసురుతున్నాయి. శుద్ధి జలంతోనే కాసింత ప్రాణానికి ఊరట లభిస్తుంది. కాని మనం నిత్యం తాగుతున్న నీటిలో స్వచ్ఛతను తరచి చూస్తే గుండె గుభేల్‌మనాల్సిందే. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో పుట్టగొడుగుల్లా వాటర్‌ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. జిల్లా అంతటా వందల సంఖ్యలో ఈ వాటర్‌ప్లాంట్లు నీటి సరఫరా చేస్తున్నాయి.

07/29/2016 - 07:13

నెల్లూరు, జూలై 28: ప్రయాణికుల సౌకర్యార్ధం గూడూరు- సికింద్రాబాద్ నడుమ నడిచే సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలను మార్పు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు గూడూరులో కొత్త సమయం ప్రకారం సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి వేదాయపాలెం రైల్వేస్టేషన్‌కు 7.10కి చేరుకుంటుంది.

07/29/2016 - 07:12

గూడూరు, జూలై 28: గూడూరులో గురువారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిపోయింది. తూర్పువీధి ప్రాంతంలోని అలఘనాధ స్వామి గుడి వీధిలో పిడుగుపాటుతో ఓ అపార్టుమెంటుకు చెందిన సన్‌షైడ్ కూలిపోయింది. అదే ప్రాంతంలో 5 టివిలు, ఒక ఎసి ఈ పిడుగుపాటుకు కాలిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఏంజరుగుతుందో తెలియక ఇళ్లల్లోని పరుగులు తీశారు.

07/29/2016 - 07:12

చిట్టమూరు, జూలై 28: మండలంలోని మల్లాం గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృత్తిక వేడుకలు ముచ్చలగుంట గ్రామస్థుడు ఓడూరు రమణారెడ్డి, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, పాలాభిషేకం, అరోణదయ కాలపూజ, 7 గంటలకు మహన్యాస పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు.

07/29/2016 - 07:11

నెల్లూరు, జూలై 28: ‘పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. కానీ ఇంతవరకూ ఒక్క మంత్రి కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కానీ, శంకుస్థాపనకు హాజరుకావడం కానీ జరగలేదు. ఇలా ఉంటే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఏమి సమాధానం చెప్పగలము’..

07/29/2016 - 07:10

నెల్లూరుసిటీ, జూలై 28: నగరపాలక సంస్థ చెత్త తరలింపు ట్రాక్టర్ల టెండర్లలో గోల్‌మాల్ జరిగిందని, ఆ టెండర్లను వెంటనే రద్దు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌కు నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశారు. గురువారం కమిషనర్ ఛాంబర్‌లో ఇరువురు ఎమ్మెల్యేలు కలిసి ప్రజా సమస్యలపై చర్చించారు.

07/29/2016 - 07:10

నెల్లూరు కలెక్టరేట్, జూలై 28: జిల్లా కేంద్రంలోని విఆర్‌సి మైదానంలో వనం-మనం కార్యక్రమ బహిరంగసభ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్‌లో ఈ విషయమై గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8:30 గంటలకు గాంధీబొమ్మ కూడలి నుండి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.

07/29/2016 - 07:09

మనుబోలు, జూలై 28: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెనెక్కడానికి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని జిల్లా వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధనరెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం ఆయన మండల పరిధిలోని కొలనుకుదురు గ్రామంలో గడప గడపకు వైఎస్‌ఆర్‌సిపి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

07/29/2016 - 07:07

హైదరాబాద్, జూలై 28: ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం ప్రస్తుతం హాట్ టాపిక్‌లా మారింది. ఆ రోజు పంచాంగ పఠ నం చేసిన పండితుడు అచ్చంగా చెప్పినట్టుగానే వైద్యశాఖను ఆరోపణలు చుట్టుముట్టాయి. మొన్న సరోజిని దేవి ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేసుకున్న 14 మంది రోగుల కళ్లు పోవడం పెద్ద దుమారం రేకెత్తించిన విషయం తెలిసిందే.

Pages