S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంత్య పుష్కరాలపై అగమ్యగోచరం

భద్రాచలం, జూలై 28: ఆది, అంత్య పుష్కరాలు కేవలం గోదావరికి మాత్రమే సొంతం. మరే నదికి అంత్యపుష్కరాలు లేవు. ఆది పుష్కరాలకు రాలేక పోయిన భక్తులు అంత్య పుష్కరాల్లో పాల్గొని పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించుకునే వీలుంది. అంత్య పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కానీ జిల్లాలో ఇందుకు తగిన ఏర్పాట్లు జరగడం లేదు. ఆది పుష్కరాలకు ఇచ్చినంత కాకపోయినా కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా విదల్చలేదు. ఏర్పాట్లు మాత్రం చేస్తున్నాం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అదనపు సిబ్బందిని నియమించకుండా, నిధులు ఇవ్వకుండా అంత్య పుష్కరాలను తూతూ మంత్రంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం ఆది పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం జిల్లాలో భద్రాచలం, మోతె, మణుగూరు, పర్ణశాలల్లో రూ.35కోట్ల వ్యయంతో ఏర్పాట్లను చేసి నిర్వహించింది. భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం రూ.1.70కోట్లు ఖర్చుచేయగా, ఆర్‌డబ్ల్యుఎస్ రూ.1.40కోట్లు, నీటిపారుదల శాఖ రూ.4.30కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.2కోట్లను ఖర్చు చేశాయి. భద్రాచలం స్నానఘట్టం వద్ద 35.50 లక్షల మంది, మోతెలో 6.50లక్షలు, పర్ణశాలలో 7.65లక్షలు, మణుగూరులో 4.70లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంత్య పుష్కరాలకు సైతం భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. 21 వేల మంది సిబ్బంది ఆది పుష్కరాల్లో విధులను నిర్వర్తించారు. ఇపుడు అంత నిధులు లేవు, సిబ్బందిని కూడా జిల్లా యంత్రాంగం నియమించడం లేదు. దీంతో ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. దీనితో సర్వత్రా గందరగోళంగా మారింది. అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.