S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆశాల సేవలు అభినందనీయం

ఖమ్మం(క్రైం), జూలై 28: సమాజంలో ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక భక్తరామదాసు క్షేత్రంలో నిర్వహించిన ఆశా సమ్మేళన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తల సేవలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో ఆశాల పాత్ర ప్రాధాన్యతను సంతరించుకుందని కొనియాడారు. అంగన్‌వాడి కేంద్రాలు, ఆరోగ్యసేవలు అందించడం, ఆరోగ్యంపై సూచనలు, సలహాలు ఇచ్చి అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ బాలసాని మాట్లాడుతూ పోటితత్వంతో ఆశాలు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన అన్నారు. అనంతరం ఆశాలకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ పాపాలాల్, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ కొండలరావు, పిఓడిటి అరుణప్రసన్న, ఎస్‌పిహెచ్‌ఓ మాలతి, డిఐశ వెంకటేశ్వర్లు, పలు డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.