S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 07:05

ఆదోని, జూలై 28: తుంగభద్ర దిగువ కాలువ ద్వారా విడుదల చేసిన నీళ్లు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన హనవాల్ గేజ్ పాయింట్ వద్దకు గురువారం చేరుకున్నాయి. కాలువలో మూడు అడుగుల మేరా నీళ్లు ప్రవహించాయి. తుంగభద్ర డ్యాం నుంచి నది దిగువ కాలువకు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని దిగువ కాలువ అధికారులు తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ పెట్టారు. ఇప్పటికి 300 క్యూసెక్కుల మేరకు కాలువకు నీటిని విడుదల చేశారు.

07/29/2016 - 07:04

కర్నూలు, జూలై 28:కృష్ణా పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేయడంతో పాటు భక్తుల భద్రతకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ విజయమోహన్ భరోసా ఇచ్చారు. శ్రీశైలంలోని పాతాళగంగలో నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్ సమీపంలో కొండ చెరియలు విరిగి పడిన ప్రాంతాన్ని గురువారం కలెక్టర్ దేవస్థానం ఇఓ సత్యానారాయణ భరత్‌గుప్తాతో కలిసి పరిశీలించారు.

07/29/2016 - 07:04

మహానంది, జూలై 28: మహానందిలోని తెలుగుగంగ కాల్వ సమీపంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు రాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి పగులగొట్టారు. దేశమే గర్వించాల్సిన జాతిపిత విగ్రహాన్ని రాళ్లతో దాడిచేసి ధ్వంసం చేయడంపై పలువురు పలు విధాలుగా విమర్శిస్తున్నారు. విగ్రహం వద్ద ఉన్న పొలం రైతు స్థలం ఆక్రమించుకొనేందుకు విగ్రహాన్ని పగులగొట్టించాడా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

07/29/2016 - 07:03

కర్నూలు, జూలై 28:నంద్యాల పట్టణానికి చెందిన ప్రభుత్వ వైద్యుడు శైలేంద్రరెడ్డి(38) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారి నుంచి 4 సెల్‌ఫోన్లు, 2 మోటార్‌బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి గురువారం ఎస్పీ ఆకే రవికృష్ణ నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

07/29/2016 - 07:03

గోనెగండ్ల, జూలై 28:్భరీ వర్షాలకు నిండుకుండలా మారిన గాజులదినె్న ప్రాజెక్టును గురువారం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గాజులదినె్న ప్రాజెక్టు వద్ద ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 1.75 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులను డ్యాం దగ్గర అవసరమయ్యే వాటికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

07/29/2016 - 07:02

బేతంచెర్ల, జూలై 28:ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తులైన రాజాఖైనీ, సిమ్లా, హిందూస్థానీ, ఖలేజా తదితర వాటిని నిషేధించడంతో పాటు వాటిని విక్రయిస్తే శిక్షార్హులని చట్టాలు చేశాయి.

07/29/2016 - 07:02

జూపాడుబంగ్లా, జూలై 28:ఏడాదిలోగా పోతిరెడ్డిపాడు ద్వారా గండికోటకు నీళ్లు తీసుకెళ్తామని శాసనమండలి డిప్యూటీ స్వీకర్ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం సతీష్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు.

07/29/2016 - 07:01

కోవెలకుంట్ల, జూలై 28:పట్టణ శివారులోని మార్కెట్ యార్డు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. మండల పరిధిలోని జొలదరాశి గ్రామానికి చెందిన షేక్‌మాలిక్ కోవెలకుంట్లలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, అదే గ్రామానికి చెందిన బొగ్గుల ప్రవీణ్‌కుమార్ పట్టణంలోని డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.

07/29/2016 - 07:01

కర్నూలు, జూలై 28:తల్లీకూతుళ్ల హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో గురువారం ఎస్పీ విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.

07/29/2016 - 07:00

పాములపాడు, జూలై 28:ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదేశించారు. ఎస్‌ఎంసి విస్తరణ పను ల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న 24వ ప్యాకేజీ వంతెన, ఎస్‌ఆర్‌బిసి బానకచెర్ల రెగ్యులేటర్ వద్ద అదనపు గేట్ల పనులను గురువారం వారు పరిశీలించారు.

Pages