S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సింగరేణిలో అవినీతిపై విచారణ జరిపించాలి

కొత్తగూడెం, జూలై 28: సింగరేణి సంస్థలో జరిగిన అవినీతిపై ఎసిబి, సిబిఐలతో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మునిగిపోయే నావలా మారిపోయిందని, రక్షించే నాధుడే కరువయ్యారని అన్నారు. కుంభకోణాలకు పాల్పడిన అధికారులపై చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మేడేపల్లి ఓపెన్‌కాస్టులో కాంట్రాక్టర్‌కు రూ 24కోట్లు అదనంగా చెల్లించిన అవినీతి విషయం వెలుగుచూసిన తరువాత ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. అదేవిధంగా సత్తుపల్లిలో సుశీహైటెక్ వారికి రూ 12కోట్లు చెల్లించిన విషయంపై కొంతమంది అధికారులకు చార్జీషీటు ఇచ్చినా జిఎం స్థాయి అధికారులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. అదేవిధంగా సత్తుపల్లి సింగరేణి కార్మికులకు 12ఎకరాలలో ఇళ్లనిర్మాణాలకు సంబంధించిన స్థలాన్ని సుశీహైటెక్‌కే అప్పగించారని, ఇప్పటివరకు ఆ సంస్థ ఆధీనంలోనే ఆ స్థలం ఉంది తప్ప నిర్మాణానికి మాత్రం అధికారులు చొరవ చూపడంలేదని అన్నారు. నిజాయితీ ఆఫీసర్లను బదిలీచేస్తూ అవినీతి అధికారులు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. అదే సత్తుపల్లిలో డిగ్రేడ్ బొగ్గును ఎఫ్‌గ్రేడ్‌గా అమ్మకాలు జరిపి రూ 12కోట్ల అవినీతికి సకల జనుల సమ్మెకాలంలో పాల్పడిన అధికారులపై కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఆర్‌సిహెచ్‌పిలో సేల్ పికింగ్ పేరిట రూ. 40 లక్షలు దుర్వినియోగం కాగా చిన్నస్థాయి అధికారులపై చర్యల మినహా ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పివికె-5ఇంక్లైన్ గనిలో శాండ్ కుంభకోణంలో రూ 60లక్షల గోల్‌మాల్ ఇప్పటికి తేలలేదన్నారు. టర్నెల్‌ను రూ 12కోట్లు పెట్టి కొనుగోలు చేశారని, ఇప్పటికి వాడకం లేక నిరుపయోగంగా ఉందన్నారు. బెల్లంపల్లిలో 17వేల బొగ్గుట్రిప్‌లు మిస్‌యూజ్ అయిన ఘటన వెలుగుచూసిందని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా బాధ్యులుగా చేసినప్పటికి ఇప్పటివరకు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు లేవన్నారు. మేడేపల్లిలో 70ట్రిపుల దొంగచాటు రవాణాపై కూడా చర్యలు లేవన్నారు. పివికె -5షాప్ట్‌లో హెడ్‌గేర్స్ పేరిట రూ 6కోట్లతో పనులు నిర్వహించగా ఆరునెలల పాటు విద్యుత్, మ్యాన్‌పవర్‌ను సంబంధిత కాంట్రాక్టర్ వినియోగించుకున్నారని చెప్పారు. భూపాలపల్లి కెఎల్‌పి మైన్‌లో హిందూ ప్రాజెక్టుకు రూ 24కోట్ల అడ్వాన్స్ పేమెంట్ విషయం కూడా వెలుగులోకి వచ్చినప్పటికి చర్యలు లేవన్నారు. డబ్బులతో అవినీతిని కప్పిపుచ్చుకునే అధికారులు అందలమెక్కుతున్నారని, సిన్సీయర్ ఆఫీసర్లు బదిలీ వేటుకు గురౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేల కోట్ల నష్టాన్ని అవినీతి కారణంగా సింగరేణి సంస్థ చవిచూస్తుందని, ఆదేవిధంగా కొనసాగితే తిరిగి బిఐఎఫ్‌ఆర్ కోరల్లోకి వెళ్ళడం తధ్యమని వ్యాఖ్యానించారు. విలేఖరుల సమావేశంలో యూనియన్ ఉపాధ్యయులు ఎవి రామారావు, నాయకులు పివి రమణారావు, ఎం ప్రభాకర్‌రావు, జి రవి, అజీజ్, బాగం శ్రీనివాసరావు, రాంశంకర్‌కోరి, షడ్రక్‌బాబు, దనాల శ్రీనివాస్, ఖాజామోహినుద్దీన్, కె రమేష్, నర్సయ్య, గోదావరిఖని, రామగుండం నాయకులు కె వీరస్వామి, రహమతుల్లా, గవరయ్యలు పాల్గొన్నారు.